Share News

ట్రంప్‌తో ఆంత్రోపిక్ సీఈఓ భేటీ.. ఏఐ సేఫ్టీపై చర్చ

ABN , Publish Date - Sep 28 , 2026 | 09:52 AM

ఏఐ సేఫ్టీపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆంత్రోపిక్ పీబీసీ చీఫ్ సీఈఓ డారియో అమొడెయ్ భేటీ అయ్యారు. ఆదివారం రాత్రి ట్రంప్‌ను కలిసిన అమొడెయ్ ఆయనతో కలిసి విందులో పాల్గొన్నారు.

ట్రంప్‌తో ఆంత్రోపిక్ సీఈఓ భేటీ.. ఏఐ సేఫ్టీపై చర్చ

ఇంటర్‌నెట్ డెస్క్: ఏఐ సేఫ్టీపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆంత్రోపిక్ పీబీసీ చీఫ్ సీఈఓ డారియో అమొడెయ్ భేటీ అయ్యారు. ఆదివారం రాత్రి ట్రంప్‌ను కలిసిన అమొడెయ్ ఆయనతో కలిసి విందులో పాల్గొన్నారు. ఏఐ భద్రతపై అమెరికా ప్రభుత్వం, అమొడెయ్ మధ్య కొన్ని రోజుల పాటు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా ఏఐ భద్రతపై ట్రంప్, అమొడెయ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలో ట్రంప్, అమొడెయ్ మొదటిసారిగా సమావేశమయ్యారు. ఏఐ మోడళ్ల అభివృద్ధిని నెమ్మది చేయాలన్న అమొడెయ్ ఆందోళనపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ అంతకుముందు చికాగోలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఏఐ సామర్థ్యాలపై మాట్లాడుతూ ఇంటర్‌నెట్ కన్నా ఏఐ సామర్థ్యాలు ఎక్కువని ట్రంప్ పేర్కొన్నారు. ‘ఏఐని మనం నడుపుతాం. ఎందుకంటే ఏఐతో మనకు ట్రిలియన్ డాలర్ల డబ్బు వస్తుంది. అలాంటప్పుడు ఏఐని ఎందుకు వదులుకోవాలి?’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.


ఇక ఈ ఏడాది ఓ ఆస్ట్రేలియా ప్రభుత్వ వెబ్‌సైట్‌ను తాము హ్యాక్ చేశామని ఓపెన్ ఏఐ మోడల్ ఇటీవలే ప్రకటించింది. అంతేకాకుండా కొన్ని అత్యాధునిక ఏఐ మోడల్స్ వల్ల భారీ భద్రతా లోపాలు కూడా బయటపడ్డాయి. దీంతో కృత్రిమ మేధస్సు భద్రతపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్, అమొడెయ్ సమావేశం అయ్యారు. ఏఐతో పొంచి ఉన్న ముప్పుపై వారిద్దరూ గతంలో వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఏఐతో భద్రతాపరమైన ముప్పు ఉందని, ఈ నేపథ్యంలో ఏఐ అభివ‌ృద్ధిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అమొడెయ్ హెచ్చరించారు. అంతేకాకుండా ఏఐ టెక్నాలజీని మరింత నియంత్రించాల్సిన అవసరం కూడా ఉందని ఆయన సూచించారు. ఆయన చేసిన విజ్ఞప్తులు, సూచనలకు దిగ్గజ ఏఐ సంస్థలు ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్, స్పేస్ ఎక్స్ ఏఐ ఫౌండర్ ఎలాన్ మస్క్ కూడా మద్దతు పలికారు. మరోవైపు వారి ఆందోళనలు, భయాలను ట్రంప్ కొట్టివేశారు. వారివి అర్థంపర్థంలేని భయాలని ఆయన పేర్కొన్నారు. ఏఐను నియంత్రించాల్సిన అవసరం లేదని, అంతేకాకుండా దాని అభివ‌ృద్ధిని నెమ్మది చేయాల్సిన అవసరం కూడా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏఐ అభివృద్ధికి కట్టడి చేయడం వెనుక అంతర్జాతీయ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.


ఇవీ చదవండి:

పాన్ కార్డులో పేరు తప్పు పడిందా..? మొబైల్‌లోనే మార్చుకోండిలా..

ఓపెన్‌ఏఐ సంచలన నిర్ణయం.. మోడళ్ల శిక్షణకు బ్రేక్.!

Updated Date - Sep 28 , 2026 | 09:52 AM