ఓయూలో గంజాయి మొక్క కలకలం!
ABN , Publish Date - Oct 02 , 2026 | 08:14 AM
ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో గంజాయి మొక్క కనిపించిందన్న విషయం కలకలం రేపింది.
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో గంజాయి మొక్క కనిపించిందన్న విషయం కలకలం రేపింది. క్యాంపస్‌లోని ఓ ప్రాంతంలో మొక్కను గుర్తించిన యూనివర్సిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా, యూనివర్సిటీ ప్రాంగణంలో గంజాయి మొక్క ఎలా పెరిగింది? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నాటారా?
అన్న అంశాలు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఆధారంగా సంబంధిత ప్రాంతానికి వెళ్లగా అక్కడ మొక్క కనిపించలేదని పేర్కొన్నారు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపే ఓయూ సెక్యూరిటీ సిబ్బంది మొక్కను తొలగించినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి:
అందుకే పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
హ్యాపీ జర్నీ.. ఆర్టీసీ, మెట్రో ఉమ్మడి పాస్ నేటి నుంచి అమలులోకి..
Read Latest AP News And Telangana News And International News And Telugu News