Share News

ట్రేడింగ్‌ పేరుతో రూ.8.40 లక్షల మోసం

ABN , Publish Date - Oct 02 , 2026 | 07:46 AM

షేర్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌, ఐపీవోల్లో పెట్టుబడుల పేరుతో ఓ వ్యక్తి నుంచి సైబర్‌ మోసగాళ్లు రూ.8.40 లక్షలు కొట్టేశారు.

ట్రేడింగ్‌ పేరుతో రూ.8.40 లక్షల మోసం
Cyber Fraud

హైదరాబాద్‌ సిటీ: షేర్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌, ఐపీవోల్లో పెట్టుబడుల పేరుతో ఓ వ్యక్తి నుంచి సైబర్‌ మోసగాళ్లు రూ.8.40 లక్షలు కొట్టేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమీన్‌పూర్‌కు చెందిన బాధితుడికి ఆగస్టు 24న గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఓ లింక్‌ వచ్చింది. దానిని క్లిక్‌ చేయడంతో ‘ఈ-73 స్టాక్‌ మార్కెట్‌ ఎలైట్‌’ పేరుతో ఉన్న వాట్సాప్‌ ట్రేడింగ్‌ గ్రూపులోకి చేర్చినట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు.


గ్రూపులో ‘ప్రవీణ్‌ పటేల్‌‘ మెంటర్‌గా, ’లతికా కుమార్‌‘ అసిస్టెంట్‌గా వ్యవహరిస్తూ షేర్‌ మార్కెట్‌పై సూచనలు ఇచ్చేవారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘క్రిస్‌ హార్పర్‌‘ అనే వ్యక్తి ఫైనాన్స్‌ అసిస్టెంట్‌గా పరిచయం చేసుకుని ‘టెన్‌కోర్‌’ అనే ట్రేడింగ్‌ యాప్‌లోకి బాధితుడిని చేర్చినట్లు తెలిపారు. షేర్లు, ఐపీవోల కోసం డబ్బులు జమ చేయాల్సిన వివిధ బ్యాంకు ఖాతాల వివరాలను పంపించారని, తొలుత రూ.50 వేలతో పెట్టుబడి ప్రారంభించిన బాధితుడు..


city2.2.jpgఆ తర్వాత పలు లావాదేవీల్లో మొత్తం రూ.8.40 లక్షలు జమ చేసినట్లు పేర్కొన్నారు. యాప్‌లో రూ.10,83,407లు లాభం వచ్చినట్లు కనిపించడంతో ఉపసంహరించుకునేందుకు ప్రయత్నించగా గ్రూప్‌లోని వ్యక్తులు స్పందించడం మానేశారని వాపోయాడు. బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అందుకే పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..

హ్యాపీ జర్నీ.. ఆర్టీసీ, మెట్రో ఉమ్మడి పాస్‌ నేటి నుంచి అమలులోకి..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 07:46 AM