విమానంలో ప్రయాణికుడి హల్‌చల్.. కేసు నమోదు
ABN , Publish Date - Oct 02 , 2026 | 08:39 AM
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానం టేకాఫ్ అయ్యే సమయంలో ప్రయాణికుడు హల్‌చల్ చేశాడు. దీంతో క్యాబిన్ సిబ్బంది అతడిని నిలువరించి.. ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు.
హైదరాబాద్, అక్టోబర్ 02: విమానం టేకాఫ్ అయ్యే సమయంలో ప్రయాణికుడు హల్‌చల్ చేశాడు. దీంతో అతడిని విమానంలో సిబ్బంది నిలువరించి.. ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది. గురువారం అర్ధరాత్రి హైదరాబాద్ - కడప ఇండిగో విమానం టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమైంది. విమానం టేకాఫ్ కోసం రన్‌వేపైకి వెళ్తోంది. ఆ సమయంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ఓ ప్రయాణికుడు ప్రయత్నించాడు.
అతడి చర్యలను గమనించిన క్యాబిన్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. క్యాబిన్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి ప్రయాణికుడు ప్రయత్నించడంతో విమానంలోని వారంతా భయాందోళనకు గురయ్యారు. అనంతరం ఆ ప్రయాణికుడిని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. అతడిని పోలీసులు విచారిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహాత్మా గాంధీ చూపిన మార్గంలో పయనిద్దాం: మంత్రి లోకేశ్
సుప్రీంకోర్టులో 250 జూనియర్ కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత
For More TG News And Telugu News