Share News

కాలువలో పడిన చిరుత పిల్ల.. గ్రామస్థులు ఏం చేశారంటే!

ABN , Publish Date - Oct 02 , 2026 | 11:15 AM

వేగంగా ప్రవహిస్తున్న కాలువలో ఓ చిరుత పిల్ల చిక్కుకుపోయింది. బయటకు రావడానికి ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. చివరకు ఏమైందో మీరే చూడండి..

కాలువలో పడిన చిరుత పిల్ల.. గ్రామస్థులు ఏం చేశారంటే!
Leopard Cub Rescue

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లా కాలాధుంగిలో ఓ చిరుత పిల్ల ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయింది. వేగంగా ప్రవహిస్తున్న నీటిలో చిక్కుకున్న ఆ చిరుత పిల్ల.. బయటకు వచ్చేందుకు ప్రయత్నించినా కాలువ గట్లు ఎత్తుగా, జారుడుగా ఉండటంతో సాధ్యం కాలేదు. ఉదయం దీనిని గమనించిన స్థానికులు.. వెంటనే అక్కడికి చేరుకుని రక్షించేందుకు ప్రయత్నించారు. చిరుత పిల్లను బయటకు తీసేందుకు వారు.. ఓ పొడవైన వెదురు కర్రను కాలువలోకి దించారు. కొద్దిసేపటి తర్వాత చిరుత పిల్ల వెదురును పట్టుకుని నెమ్మదిగా పైకి కదులుతూ చివరకు కాలువ నుంచి బయటపడింది. బయటకు వచ్చిన వెంటనే అది వేగంగా అడవి వైపు పరుగులు తీసింది.


ఈ వీడియో @KumaonJagranఅనే యూజర్ ఎక్స్‌లో ట్వీట్ పోస్ట్ చేశారు. ఈ ఘటనలో గ్రామస్తులు చూపిన చొరవను సోషల్ మీడియా యూజర్లు ప్రశంసిస్తున్నారు. దీనిపై రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘మనుషుల్లో మానవత్వం ఇంకా ఉంది’ అని, ‘క్రూరమృగమైనా.. ఆపదలో ఉంటే ప్రాణభయం తప్పదు’ అని ఒకరు, ‘చిరుత పిల్ల కాపాడిన విధానం గ్రేట్’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

బంగారం చోరీ.. ఏమాత్రం తగ్గని యూట్యూబర్..

భారీ మొసలిని అవలీలగా ఎత్తేసిన మహిళ.. వీడియో వైరల్..

Updated Date - Oct 02 , 2026 | 12:02 PM