Share News

భారీ మొసలిని అవలీలగా ఎత్తేసిన మహిళ.. వీడియో వైరల్..

ABN , Publish Date - Sep 28 , 2026 | 09:40 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొందరు వ్యక్తులు చేసే విన్యాసాలు ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

భారీ మొసలిని అవలీలగా ఎత్తేసిన మహిళ.. వీడియో వైరల్..
woman carries alligator

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొందరు వ్యక్తులు చేసే విన్యాసాలు ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ భారీ మొసలిని ఓ యువతి ఎత్తుకుని నడుస్తున్న వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (woman carries alligator).


thereptilezoo అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ మహిళా జూ కీపర్ దాదాపు 110 కిలోల బరువున్న మొసలిని ఎత్తుకుని నడుస్తూ కనిపిస్తోంది. ఇంత భారీ జంతువును ఆమె అంత సులభంగా ఎత్తడం చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ మొసలి పేరు డార్త్. డార్త్‌కు తనతో చాలా కాలంగా అనుబంధం ఉందని ఆ జూకీపర్ తెలిపింది. డార్త్‌తో తనకు ఎంత పరిచయం ఉన్నప్పటికీ అది అడవి జంతువేనని, ఎప్పుడూ జాగ్రత్తగా, గౌరవంగా వ్యవహరించాల్సిందేనని పేర్కొంది (viral alligator video).


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు (viral animal video). కొందరు ఆ మొసలి పరిమాణాన్ని చూసి ఆశ్చర్యపోయారు. మరికొందరు జూకీపర్ ధైర్యాన్ని ప్రశంసించారు. ఇంకొందరు మాత్రం ఇంత పెద్ద మొసలిని అలా ఎలా ఎత్తగలిగావంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

టీఎంసీ పేరు, గుర్తు వివాదం.. ఈసీకి సుప్రీంకోర్టు కీలక డెడ్‌లైన్..


పార్కింగ్ ఛార్జీలు డబుల్, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు కొత్త ప్లాన్..

Updated Date - Sep 28 , 2026 | 09:40 PM