Share News

టీఎంసీ పేరు, గుర్తు వివాదం.. ఈసీకి సుప్రీంకోర్టు కీలక డెడ్‌లైన్..

ABN , Publish Date - Sep 28 , 2026 | 03:27 PM

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపై కొనసాగుతున్న వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇరు వర్గాలు తమ వాదనలు, అఫిడవిట్లు సమర్పించేందుకు నాలుగు వారాల సమయం ఇచ్చింది.

టీఎంసీ పేరు, గుర్తు వివాదం.. ఈసీకి సుప్రీంకోర్టు కీలక డెడ్‌లైన్..
TMC name symbol dispute

ఇంటర్నెట్ డెస్క్: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపై కొనసాగుతున్న వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇరు వర్గాలు తమ వాదనలు, అఫిడవిట్లు సమర్పించేందుకు నాలుగు వారాల సమయం ఇచ్చింది. ఆ ప్రక్రియ పూర్తైన తర్వాత మూడు నెలల్లోగా వివాదంపై తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీంతో మొత్తం వ్యవహారం నాలుగు నెలల వ్యవధిలో తేలేలా కాలపరిమితి ఏర్పడింది (TMC name symbol dispute).


అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేరు, దాని రిజర్వ్‌డ్ ఎన్నికల గుర్తు అయిన 'పూలు-గడ్డి'పై పార్టీలోని రెండు వర్గాలు హక్కు కోరుతున్నాయి. ఒక వర్గానికి మమతా బెనర్జీ నాయకత్వం వహిస్తుండగా, మరో వర్గంలో రితబ్రత బెనర్జీ కీలకంగా ఉన్నారు. పార్టీ పేరు, గుర్తు, సంస్థాగత నియంత్రణ తమదేనంటూ ఇరు వర్గాలు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాయి. ఈ వివాదంపై సెప్టెంబర్ 17న ఎన్నికల సంఘం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది (Trinamool Congress symbol row).


పార్టీ పేరు, గుర్తుపై తుది నిర్ణయం వెలువడే వరకు ఇరు వర్గాలు వాటిని ఉపయోగించకూడదని ఆదేశించింది (Supreme Court TMC). రానున్న ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇరు వర్గాలకు ప్రత్యామ్నాయ పేర్లు, గుర్తులను కేటాయించింది. ఎన్నికల సంఘం మధ్యంతర ఉత్తర్వును సవాలు చేస్తూ మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసలు పార్టీ పేరు, గుర్తును నిలిపివేయడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి డెడ్‌లైన్ విధించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

బీజేపీ ఓటు చోరీ చేసి మోసం చేసింది: మంత్రి ఉత్తమ్

రేవంత్‌.. ఆ ఆధారాలు చూపెట్టు.. కేటీఆర్ సవాల్

Updated Date - Sep 28 , 2026 | 04:18 PM