Home » Trinamool Congress
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ (80) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. కోల్‌కతాలోని తన నివాసంలో కన్నుమూశారు. గతేడాది న్యుమోనియా సోకడంపాటు పలు అనారోగ్య సమస్యలు తలెత్తాయి..
కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని పీఠం ఎక్కుతారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన విషయం తెలిసిందే. అయితే..
ఇండియా కూటమిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ వ్యవహారం కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతోంది. దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అధీర్ చౌదరి వైఖరి పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సీరియస్ అయ్యారు...
రాజకీయ సంచలనం ఒకరు.. రాచరిక విలక్షణ వారసురాలు మరొకరు. ఒకరు అత్యాధునిక వేషభాషలు, నవీన భావాలకు ప్రతినిధి అయితే, మరొకరు జాతీయ సంప్రదాయాలకు, మూల విలువలకు పెట్టింది పేరు. ఇద్దరు మహిళలు ఎన్నికల బరిలో దిగడం మామూలే అయినా, ఈ ఇద్దరి నేపథ్యాల రీత్యా పశ్చిమబెంగాల్ సరిహద్దు జిల్లా నడియాలోని లోక్‌సభ స్థానం కృష్ణానగర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
పశ్చిమ బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2016లో చేపట్టిన ప్రభుత్వ ప్రయోజిత, ఎయిడెడ్ పాఠశాలల టీచర్ల నియామకాన్ని కోల్‌కతా హైకోర్టు సంచలనాత్మక రీతిలో రద్దు చేసింది. చట్టవిరుద్ధంగా నియామకాలు జరిగాయని, మోసపూరితంగా ఖాళీ ఓఎంఆర్ షీట్లు సమర్పించిన అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని హైకోర్ట్ తేల్చింది. ఈ ఆదేశాలతో ఏకంగా 25,753 మంది టీచర్ ఉద్యోగాలను కోల్పోనున్నారు.