Share News

పార్కింగ్ ఛార్జీలు డబుల్, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు కొత్త ప్లాన్..

ABN , Publish Date - Sep 28 , 2026 | 02:40 PM

చలికాలంలో ఢిల్లీని వాయుకాలుష్యం వణికిస్తుంటుంది. ప్రతి ఏటా చలికాలంలో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అందుకే ఈ ఏడాది వాయు కాలుష్యాన్ని నివారించే ముందస్తు చర్యలకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైంది.

పార్కింగ్ ఛార్జీలు డబుల్, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు కొత్త ప్లాన్..
Delhi winter pollution plan

ఇంటర్నెట్ డెస్క్: చలికాలంలో ఢిల్లీని వాయుకాలుష్యం వణికిస్తుంటుంది. ప్రతి ఏటా చలికాలంలో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అందుకే ఈ ఏడాది వాయు కాలుష్యాన్ని నివారించే ముందస్తు చర్యలకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైంది. శీతాకాల కాలుష్య నియంత్రణ ప్రణాళికలో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్కింగ్ ఛార్జీలను రెట్టింపు చేయడం, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం వంటి చర్యలు ఈ ప్రణాళికలో ఉన్నాయి (Delhi winter pollution plan).


వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి, ప్రజా రవాణా వైపు ప్రజలను ప్రోత్సహించేందుకు అధికారిక పార్కింగ్ ప్రాంతాల్లో పార్కింగ్ ఛార్జీలను రెట్టింపు చేయనున్నారు. ఈ పెంపు నవంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉంటుంది. అయితే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్వహించే పార్కింగ్ ప్రదేశాలకు ఈ పెంపు నుంచి మినహాయింపు ఉంటుంది (Delhi air pollution).


అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో గరిష్ఠంగా 50 శాతం సిబ్బంది మాత్రమే కార్యాలయాలకు హాజరు కావాలి. మిగిలిన 50 శాతం మంది ఇంటి నుంచే పనిచేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన నవంబర్ 1 నుంచి జనవరి 31 వరకు అమల్లో ఉండనుంది. అత్యవసర సేవలకు సంబంధించిన విభాగాలకు అవసరమైన మినహాయింపులు ఉంటాయి. ఇక, రోడ్లపై రద్దీని తగ్గించేందుకు కార్యాలయాల పనివేళలను కూడా వేర్వేరుగా నిర్ణయించారు (work from home Delhi).


శీతాకాలంలో దుమ్ము ద్వారా ఏర్పడే కాలుష్యాన్ని నియంత్రించేందుకు నవంబర్ 1 నుంచి జనవరి 31 వరకు దుమ్మును పెంచే నిర్మాణ, కూల్చివేత పనులపై ఆంక్షలు ఉంటాయి. పెద్ద వాణిజ్య భవనాలు, కార్యాలయాలు, హోటళ్లు, మాల్స్ వంటి నిర్మాణాల్లో కాలుష్య నియంత్రణ కోసం యాంటీ-స్మాగ్ గన్స్ లేదా మిస్ట్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

బీజేపీ ఓటు చోరీ చేసి మోసం చేసింది: మంత్రి ఉత్తమ్

రేవంత్‌.. ఆ ఆధారాలు చూపెట్టు.. కేటీఆర్ సవాల్

Updated Date - Sep 28 , 2026 | 02:40 PM