'ప్రజల మధ్య ప్రశ్నిస్తే చెంపదెబ్బ.. పేపర్ లీక్స్ గురించి అడిగితే లాఠీచార్జ్'
ABN , Publish Date - Sep 28 , 2026 | 02:28 PM
ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తను ఢిల్లీ మంత్రి పర్వేశ్ శర్మ చెంపదెబ్బ కొట్టడంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజల మధ్య ప్రశ్నిస్తే, చెంపదెబ్బ కొడుతున్నారని, పేపర్ లీకుల గురించి మాట్లాడితే లాఠీచార్జి చేయిస్తున్నారని బీజేపీ ప్రభుత్వాలపై ఎక్స్‌లో ఆయన మండిపడ్డారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తను ఢిల్లీ మంత్రి పర్వేశ్ శర్మ చెంపదెబ్బ కొట్టడంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజల మధ్య ప్రశ్నిస్తే, చెంపదెబ్బ కొడుతున్నారని, పేపర్ లీకుల గురించి మాట్లాడితే లాఠీచార్జి చేయిస్తున్నారని బీజేపీ ప్రభుత్వాలపై ఎక్స్‌లో ఆయన మండిపడ్డారు. పార్లమెంట్‌లో ప్రశ్నిస్తే మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మైక్ స్విచ్చాఫ్ చేస్తారని విమర్శించారు.
‘ఇటీవలే ఢిల్లీలో ఓ ఆప్ కార్యకర్తను మంత్రి పర్వేశ్ వర్మ చెంపదెబ్బ కొట్టడాన్ని దేశమంతా చూసింది. మంత్రి కార్యాలయం ముందే రోడ్డును తవ్వారు. అదేంటని ఆ కార్యకర్త అడుగుతున్నారు. ఆ సమయంలో ఆయన చేతిలో కెమెరా ఉంది. అంతే.. మంత్రి పర్వేశ్ ఆయనపై చేయిచేసుకున్నారు. ఆయన చెంపపై కొట్టారు. ఓటు చోరీ కారణంగా ఎన్నికల్లో ఓడిపోతామనే భయం అలాంటి వారికి లేదు. అందుకే వారు ఇష్టమొచ్చినట్లు, అహంకారపూరితంగా ప్రవర్తిస్తున్నారు. ప్రజల ఓట్లు పొందకుండానే అధికారంలోకి వచ్చిన వారు ప్రజలను పట్టించుకోరు’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీజేపీ ఓటు చోరీ చేసి మోసం చేసింది: మంత్రి ఉత్తమ్
రేవంత్.. ఆ ఆధారాలు చూపెట్టు.. కేటీఆర్ సవాల్