బంగారం చోరీ.. ఏమాత్రం తగ్గని యూట్యూబర్..
ABN , Publish Date - Sep 29 , 2026 | 11:40 AM
ప్రముఖ యూట్యూబర్ మధుమిత ఇంట్లో 118 సవర్ల బంగారు నగలు చోరీ అయిన కొన్ని గంటల్లోనే ఇన్‌స్ట్రాలో పోస్ట్ చేసిన రీల్స్ తెగ వైరల్ అవుతోంది. చోరీకి సంబంధించిన దర్యాప్తులో సోషల్ మీడియా పోస్టులపైనా పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది..
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ యూట్యూబర్ మధుమిత ఇంట్లో 118 సవర్ల బంగారు నగలు చోరీ అయిన కొన్ని గంటల్లోనే ఇన్‌స్ట్రాలో పోస్ట్ చేసిన రీల్స్ తెగ వైరల్ అవుతోంది. కన్నియాకుమరి జిల్లా నాగర్‌కోవిల్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ మధుమిత ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఆమె భర్త వినోద్‌కుమార్‌తో కలిసి బయటకు వెళ్లిన సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి 118 సవర్ల బంగారు ఆభరణాలు.. నగదును అపహరించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. మధుమిత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ బంగారు ఆభరణాలు ధరించిన ఫొటోలు.. వీడియోలతో పాటు నగదు కట్టలను చూపిస్తూ రీల్స్ పోస్టు చేసేవారు. ఆమె సోషల్ మీడియా పోస్టులను గమనించిన వ్యక్తులే చోరీకి పాల్పడి ఉండొచ్చనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
చోరీ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే మధుమిత ఇన్‌స్టాగ్రామ్‌లో వరుసగా 10 వీడియోలను పోస్టు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆమె తన ఖాతాలో వేలాది వీడియోలను పోస్టు చేయగా, వాటిలో నగలు, నగదును ప్రదర్శించే వీడియోలు కూడా ఉన్నాయి. తాజాగా పోస్టు చేసిన వీడియోల్లో ఆమె తలపై డబ్బులు పోసుకుంటూ డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో ఈ రీల్స్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి.
ఒక వీడియోకు సుమారు 40 గంటల్లోనే 39 లక్షలకుపైగా వ్యూస్, మరో వీడియోకు 20 లక్షలకుపైగా వీక్షణలు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 10 వీడియోలు కలిపి సుమారు 1.50 కోట్ల వీక్షణలు సాధించగా.. ఆమెను ఫాలో అవుతున్న వారి సంఖ్య కూడా 5 లక్షలకు చేరినట్లు సమాచారం. భారీ చోరీ జరిగినప్పటికీ.. ఆమె ఇన్ స్ట్రాలో వరుస పోస్టులు చేయడం పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలూ చదవండి
గోల్ఫ్ బంతులు మింగేసిన పాము.. కాపాడిన వైద్యులు.. వీడియో వైరల్
కొండచిలువలను వేటాడే రోబో కుందేళ్లు.. ఫ్లోరిడాలో కొత్త టెక్నాలజీ