Share News

ఏఐ చూస్తోంది.. జాగ్రత్త

ABN , Publish Date - Jul 24 , 2026 | 12:48 PM

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్‌ పరిధిలోని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల దరఖాస్తుదారులకు ఏఐ ఆధారిత 360 డిగ్రీ సర్వే అనర్హులకు షాక్‌ ఇచ్చింది.

ఏఐ చూస్తోంది.. జాగ్రత్త
Double bedroom scheme, AI Based 360 Degree Verification

  • ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహాయంతో డబుల్‌ బెడ్‌రూమ్‌ దరఖాస్తుల స్ర్కీనింగ్‌

  • 360 డిగ్రీ సర్వేతో బయటపడిన ఆస్తుల చిట్టా

జమ్మికుంట(కరీంనగర్): జమ్మికుంట మున్సిపల్‌ పరిధిలోని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల దరఖాస్తుదారులకు ఏఐ ఆధారిత 360 డిగ్రీ సర్వే అనర్హులకు షాక్‌ ఇచ్చింది. తమకు ఇల్లు, స్థలం, వ్యవసాయ భూమి, బ్యాంకు డిపాజిట్లు, వాహనాలు, ఇతర ఆస్తులు ఏమీలేవని పేర్కొంటూ పలువురు ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్నారు. వారి ఆస్తుల వివరాలను ఈ సర్వే బయట పెట్టింది. దీంతో అర్హుల ఎంపికలో పారదర్శకత పెరిగిందనే అభిప్రాయం వినిపిస్తోంది.


2023 డిసెంబరులో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్‌ పరిధి నుంచి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కోసం 2,448 మంది దర ఖాస్తులు చేసుకున్నారు. మున్సిపల్‌ పరిధిలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల పక్కన 240, మారుతినగర్‌ 108, ధర్మారం 152, మొత్తం 500 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు సిద్ధంగా ఉన్నాయి. మొద టి విడత ఇళ్ల కేటాయింపునకు 500 మంది పేర్లను అర్హులుగా గుర్తిస్తూ మున్సిపల్‌ అధికారులు కలెక్టర్‌ కు అప్రూవల్‌ కోసం పంపించారు.


hzb1.2.jpg152 మంది అనర్హుల గుర్తింపు

360 డిగ్రీ సర్వేలో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూశాయి. మున్సిపల్‌ అధికారులు పంపిం చిన 500 మంది జాబితాలో 152 మంది అనర్హులు ఉన్నట్లు సర్వే గుర్తించింది. వీరిలో కొందరి పేర్లపై ప్లాట్లు, వ్యవసాయ భూములు, స్థలాలు, బ్యాంకు డిపాజిట్లు, తదితర ఆస్తుల వివరాలు సాంకేతికంగా గుర్తించింది. మొదట పంపిన జాబితాలో తమ పేర్లు ఉన్నప్పటికీ తుది జాబితా లో లేకపోవడంతో పలువురు దరఖాస్తుదారులు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. వారి తాకిడి తట్టుకోలేని అధికారులు 360 డిగ్రీ సర్వేలో నమోదైన ఆస్తుల వివరాలను సంబంధిత దరఖాస్తుదారులకు చూపిస్తుండడంతో చాలామంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఒకవైపు నిజమైన పేదలకు న్యాయం జరిగే అవకాశం ఉండగా, మరోవైపు తప్పుడు వివరాలతో దరఖాస్తు చేసిన వారి గుట్టును ఈ సర్వే రట్టు చేస్తోంది. జమ్మికుంట ఈ పరిణామం డబుల్‌ బెడ్‌రూమ్‌ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో కీలక మలుపుగా మారింది.


360 డిగ్రీ సర్వే ద్వారా అనర్హులను గుర్తిస్తున్నాం..

  • గుట్టల మల్లికార్జునస్వామి, మున్సిపల్‌ కమిషనర్‌

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో మొదట 500 మంది పేర్లు అప్రూవల్‌ కోసం పం పించాం. ఉన్నతాధికారులు ఏఐ ఆధారిత 360 డిగ్రీ సర్వే ద్వారా 152 మందిని అనర్హులుగా గుర్తించారు. వారి పేరిట ఉన్న ప్లాట్లు, వ్యవసాయ భూమి, డిపా జిట్లు, ఇతర ఆస్తుల వివరాలతో కూడిన అనర్హుల జాబితా పంపించారు. సర్వే ద్వారా తేలిన ఆస్తుల విషయమై నో- ఆబ్జెక్షన్‌ (ఆస్తులు మావి కావని) తెచ్చు కుంటే దరఖాస్తుదారుల పేర్లను రెండో విడతలో తిరిగి పంపిస్తాం.


ఈ వార్తలు కూడా చదవండి:

క్రెడిట్‌, డెబిట్‌ కార్డు సైజులో రేషన్‌ కార్డు

కాజీపేట్‌-బలార్ష మార్గంలో మూడో లైన్‌ రెడీ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 24 , 2026 | 12:48 PM