ఒకేసారి మూడు నెలల బియ్యం
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:01 PM
ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రప్రభుత్వం మరోమారు నిర్ణయించింది.
ఆగస్టు 1 నుంచి పంపిణీకి చర్యలు
రేషన్ దుకాణాలకు సరఫరా
ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి
జిల్లా పౌరసరఫరా అధికారులు
తొర్రూరు(మహబుబాబాద్): ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రప్రభుత్వం మరోమారు నిర్ణయించింది. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలలకు సంబంధించిన రైస్‌ను లబ్ధిదారులకు ప్రభుత్వం ఒకేసారి ఇవ్వనున్నారు. దీని కోసం జిల్లా పౌరసరఫరా అధికారులు రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా ప్రక్రియను చేపట్టారు. ఆగస్టులో మూడు నెలలకు సంబం ధించిన బియ్యాన్ని రేషన్‌కార్డు దారులకు ఇవ్వనున్నారు.
ఒక్కొక్కరికీ 18 కిలోలు..
మహబూబాబాద్ జిల్లాలోని 18మండలాల్లో 558 రేషన్ షాపులు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతీనెల 5,200 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. దీనికి గాను ప్రతీనెల 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపులు తెరిచి ఉంటాయి. కానీ, ఆగస్టులో మాత్రం 22 రోజు లు షాపులు తెరిచి ఉంటాయని పౌరసరఫరా అధికారులు తెలిపారు. ఓటీపీ, ఎఫ్‌ఆర్‌ఎస్ విధానంలో బియ్యం పంపిణీ జరుగుతుంది. జిల్లాలో 2,78,712 రేషన్ కార్డుల్లో 8,23,423 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి గాను ప్రతీ ఒక్కరికి 6 కిలోల చొప్పున 18 కిలోల బియ్యం అందజేయనున్నారు.
ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి..
రేషన్ కార్డుల లబ్ధ్దిదారులందరు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో 6,50,000 మంది లబ్ధిదారులు ఈ కేవైసీ పూర్తి చేసుకున్నారని మిగిలిన 1,67,000 మంది లబ్ధిదారులు ఈకేవైసీ చేసుకోలేదని సుమారు 70 శాతం పూర్తికావచ్చిందన్నారు. మిగిలిన లబ్ధిదారులందరు ఈనెల 31 తేదీలోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు తెలుపుతున్నారు. దీని కోసం రేషన్ షాపులు తీసి ఉంచాలని డీలర్లను అఽధికారులు ఆదేశించారు.
ఆందోళనలో డీలర్లు..
మూడు నెలల రేషన్ బియ్యం కోటా ఒకేసారి విడుదల చేస్తుండడంతో తమకు శ్రమ అధికమవుతుందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షాపులు చిన్న ఇండ్లలో ఉండడంతో నిల్వ సామర్థ్యం లేకపోవడం మూడునెలల కోటా పట్టకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని దీంతో పాటు తూకంలో తరుగు వస్తుందని వాపోతున్నారు. గతంలో కూడా రెండుసార్లు ఇచ్చిన రేషన్ కోటాలో తరుగు వచ్చి నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పాస్ యంత్రాలు సక్రమంగా పనిచేయకపోవడం సిగ్నల్ అందకపోవడం, వినియోగదారుల వేలిముద్రలు పెట్టడం కష్టమవుతోంది. ఒక్కొక్కరికి 20 నిముషాల సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈకేవైసీ తప్పనిసరి..
జాటోతు రమేష్, జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి
లబ్ధిదారులు తప్పనిసరిగా ఈకేవైసీని రేషన్ షాపుల్లో పూర్తి చేసుకోవాలి. రేషన్‌కార్డులో నమోదైన ప్రతీ కుటుంబ సభ్యుడు తమకు కేటాయించిన షాపుకు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ చేయించుకోవాలి. సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. మూడునెలల రేషన్ పంపిణీపై ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే పంపిణీ చేస్తాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా షాపులకు రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
క్రెడిట్, డెబిట్ కార్డు సైజులో రేషన్ కార్డు
కాజీపేట్-బలార్ష మార్గంలో మూడో లైన్ రెడీ
Read Latest AP News And Telangana News And International News And Telugu News