కాజీపేట్-బలార్ష మార్గంలో మూడో లైన్ రెడీ
ABN , Publish Date - Jul 24 , 2026 | 10:46 AM
ఆసిఫాబాద్- సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య 11 కిలోమీటర్ల మేర చివరిదశ విద్యుద్ధీకరణ పనులు పూర్తి కావడంతో కాజీపేట- బలార్షా ట్రిప్లింగ్ ప్రాజెక్టు సంపూర్ణమైంది.
200కి.మీ. మేర విద్యుద్ధీకరణ ప్రాజెక్టు కూడా పూర్తి
హైదరాబాద్ సిటీ: ఆసిఫాబాద్- సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య 11 కిలోమీటర్ల మేర చివరిదశ విద్యుద్ధీకరణ పనులు పూర్తి కావడంతో కాజీపేట- బలార్షా ట్రిప్లింగ్ ప్రాజెక్టు సంపూర్ణమైంది. సుమారు రూ.3వేల కోట్ల వ్యయంతో కాజీపేట-బలార్ష మధ్య 203 కి.మీ. మేర చేపట్టిన మూడవ లైన్ నిర్మాణం, విద్యుద్ధీకరణ పనులు, అలాగే బిబ్రానదిపై నిర్మించిన కీలకమైన వంతెనతో సహా, మొత్తం ప్రాజెక్ట్ సిద్ధం కావడంతో ఈ మార్గంలో రైళ్లు మరింత వేగంగా ముందుకు సాగనున్నాయి.
దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలిపే కీలకమైన కాజీపేట- బలార్షా రైలు మార్గంలోని బొగ్గు, సిమెంట్ సైడింగ్‌లను కూడా ఇది అనుసంధానిస్తుంది. అలాగే, ఈ మార్గంలో ప్రయాణికుల, సరుకు రవాణా నిరంతరం పెరుగుతున్న రద్దీని తగ్గించడానికి ఉపకరిస్తుంది. ఈ సందర్భంగా ఎస్‌సీఆర్ జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ కీలకమైన ప్రాజెక్టు పూర్తికావడం వల్ల దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య రైల్వే అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇది ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
క్రెడిట్, డెబిట్ కార్డు సైజులో రేషన్ కార్డు
Read Latest AP News And Telangana News And International News And Telugu News