వంద డాలర్లు దాటిన ముడిచమురు ధర.. కొనసాగుతున్న భారీ నష్టాలు..
ABN , Publish Date - Jul 24 , 2026 | 09:55 AM
దేశీయ సూచీలకు నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర వంద డాలర్లు దాటడం సూచీలకు తీవ్ర ప్రతికూలంగా మారింది.
దేశీయ సూచీలకు నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర వంద డాలర్లు దాటడం సూచీలకు తీవ్ర ప్రతికూలంగా మారింది. మరోవైపు ఐటీ సెక్టార్ మొదటి త్రైమాసికం ఫలితాలు నిరాశజనకంగా ఉండడం కూడా సూచీలను వెనక్కి లాగుతోంది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 96.51గా ఉంది. (Indian stock market).
గత సెషన్ ముగింపు (76,391)తో పోల్చుకుంటే శుక్రవారం ఉదయం దాదాపు 700 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ అదే బాటలో సాగుతోంది. ఉదయం 9:45 గంటల సమయంలో సెన్సెక్స్ 767 పాయింట్ల నష్టంతో 75,623 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 227 పాయింట్ల నష్టంతో 23,641 వద్ద ఉంది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో నవుమా వెల్త్, యునైటెడ్ స్పిరిట్స్, సిప్లా, ఐసీఐసీఐ లాంబార్డ్, ఎస్‌ఆర్‌ఎఫ్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). మోతీలాల్ ఓస్వాల్, స్విగ్గీ, సీజీ కన్జ్యూమర్, చోలా ఇన్వెస్ట్, హీరో మోటాకార్ప్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 512 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 580 పాయింట్ల నష్టంతో ఉంది.
ఇవి కూడా చదవండి..
ఇరాక్ ద్వారా అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదన.. తిరస్కరించిన ఇరాన్..
పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..