కన్నీరు పెట్టిస్తున్న విషాదం.. క్షణాల్లో కుటుంబాన్ని కబళించిన కొండచరియ..
ABN , Publish Date - Jul 24 , 2026 | 08:40 AM
కుటుంబాన్ని బాగా చూసుకునేందుకు అతడు సౌదీ అరేబియాలో 28 ఏళ్ల పాటు కష్టపడ్డాడు. అక్కడ సంపాదించిన డబ్బులతో స్వదేశానికి తిరిగి వచ్చి అందమైన ఇల్లు కట్టుకున్నాడు. స్థానికులు ఆ ఇంటిని 'తాజ్‌మహల్' అని పిలిచేవారు.
కుటుంబాన్ని బాగా చూసుకునేందుకు అతడు సౌదీ అరేబియాలో 28 ఏళ్ల పాటు కష్టపడ్డాడు. అక్కడ సంపాదించిన డబ్బులతో స్వదేశానికి తిరిగి వచ్చి అందమైన ఇల్లు కట్టుకున్నాడు. స్థానికులు ఆ ఇంటిని 'తాజ్‌మహల్' అని పిలిచేవారు. ఎంతో సంతోషంగా సాగుతున్న జీవితంలో వర్షం విషాదం నింపింది. అతడు ఎంతో కష్టపడి కట్టించుకున్న ఇల్లే అతడి కుటుంబం మొత్తాన్ని బలి తీసుకుంది. జమ్మూ, కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో జరిగిన ఈ విషాదం చాలా మందిని కంటతడి పెట్టిస్తోంది (Poonch landslide).
జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు ఒక కుటుంబాన్ని చిదిమేశాయి. మహ్మద్ లతీఫ్ అనే వ్యక్తి సౌదీ అరేబియాలో దాదాపు 28 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బుతో పూంచ్ జిల్లాలోని పిర్ పంజల్‌లో ఐదు అంతస్తుల విలాసవంతమైన ఇల్లు నిర్మించుకున్నారు. అయితే ఇటీవలి వర్షాలకు భారీ కొండచరియ విరిగిపడి అతడి ఇంటిని కూల్చేసింది. ఇంటి శిథిలాల కింద భార్య, కుమార్తె, ముగ్గురు కుమారులు, మనవడు చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహ్మద్ లతీఫ్ జీవితాంతం మరిచిపోలేని విషాదంలో మునిగిపోయారు (Saudi NRI family).
లతీఫ్ 1998 నుంచి సౌదీ అరేబియాలో పనిచేస్తూ తన కలల ఇంటిని నిర్మించుకున్నారు. ఇంట్లోని బాత్రూమ్ ఫిట్టింగ్స్ నుంచి ఇతర సామగ్రి వరకు విదేశాల నుంచి తెప్పించి నిర్మించారు. ఏడు సంవత్సరాల పాటు అత్యుత్తమ నాణ్యతతో నిర్మించిన ఈ భవనం ఇప్పుడు ఇనుప కుప్పగా మిగిలింది. ప్రమాదం జరిగిన సమయంలో లతీఫ్ తన కారును సురక్షిత ప్రదేశానికి తరలించడానికి బయటకు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి భారీ బండరాళ్లు, మట్టి ప్రవాహం అతడి ఇంటిని పూర్తిగా కూల్చివేశాయి (Poonch rain tragedy).
ఈ దుర్ఘటనలో ఆయన భార్య, ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు, చిన్న మనవడు మరణించారు. వివాహం అయిన మరో కుమార్తె, చదువుకుంటున్న ఒక కుమారుడు మాత్రమే ప్రస్తుతం ప్రాణాలతో మిగిలారు. శిథిలాల కింద ఇంకెవరైనా బతికి ఉన్నారేమోనన్న ఆశతో సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
ఇరాక్ ద్వారా అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదన.. తిరస్కరించిన ఇరాన్..
పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..