Share News

విజయవాడ కార్పొరేషన్‌లో కూటమి పార్టీ విజయకేతనం ఎగురవేయాలి: మంత్రి కందుల దుర్గేశ్

ABN , Publish Date - Jul 24 , 2026 | 12:01 PM

జనసేన పార్టీ కోసం గ్రామస్థాయి నుంచి కార్యకర్తలు సొంతంగా పనిచేశారని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం అందరం సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మిత్రపక్ష పార్టీల‌ నేతలను కలుపుకుని ముందుకు సాగాలని నేతలకు సూచించారు.

విజయవాడ కార్పొరేషన్‌లో కూటమి పార్టీ విజయకేతనం ఎగురవేయాలి: మంత్రి కందుల దుర్గేశ్
Minister Kandula Durgesh

విజయవాడ, జులై 24: జనసేన పార్టీ కోసం గ్రామస్థాయి నుంచి కార్యకర్తలు సొంతంగా పనిచేశారని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. ఈరోజు(శుక్రవారం) జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర బాగు ‌కోసం కూటమి విజయం సాధించాలని అందరం క‌లిసి పని చేశామని చెప్పారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసం అంతా సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మిత్రపక్ష పార్టీల‌ నేతలను కలుపుకుని ముందుకు సాగాలని నేతలకు సూచించారు.


పార్టీ కోసం పని చేసే వారిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుర్తించి‌ ప్రోత్సహిస్తారని మంత్రి తెలిపారు. జనసేన పార్టీని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లేలా పని చేయాలని అన్నారు. జనసేన పార్టీ బలం పెంచుకోవడం ద్వారా ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. నేడు జనసేనలో ఎంతోమంది సామాన్య కార్యకర్తగా పని చేసి వివిధ హోదాలు సంపాదించారన్నారు. రాష్ట్రంలో వైసీపీ వంటి పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పేలా అందరూ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.


విజయవాడ కార్పొరేషన్‌లో కూటమి పార్టీ విజయకేతనం ఎగురవేయాలని కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, ఎమ్మెల్యే బొలిశెట్టి , సామినేని ఉదయభాను, అమ్మిశెట్టి వాసు, రావి సౌజన్యతో పాటు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి...

పార్వతీపురం మన్యం జిల్లాకు కుంకీ ఏనుగుల తరలింపు.. మంగళగిరిలో పవన్ స్వాగతం

ప్రజాదర్బార్‌లో ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 24 , 2026 | 12:05 PM