'అద్వితీయమైన బ్యాటింగ్'.. బేబీ బాస్‌పై కెప్టెన్ ప్రశంసల జల్లు
ABN , Publish Date - Jul 24 , 2026 | 11:20 AM
జింబాబ్వేతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో అలరించిన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రశంసించాడు.
ఇంటర్నెట్ డెస్క్: వరుస పరాజయాల తర్వాత భారత జట్టు విజయాల బాటపట్టింది. జింబాబ్వేతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపునకు యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్ కీలకంగా నిలిచింది. స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ యువ కెరటం.. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేసి ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. అతని దూకుడైన ఇన్నింగ్స్‌తో భారత్ మూడు వికెట్లు కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని అందుకుంది. దీంతో టీమ్ఇండియా సిరీస్‌ను విజయంతో ఆరంభించింది.
మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ యువ బ్యాటర్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. 'వైభవ్ అద్వితీయంగా బ్యాటింగ్ చేశాడు. అతను నిర్భయంగా ఆడే యువ ఆటగాడు. ఇన్నింగ్స్‌ను వైభవ్ నిర్మించిన తీరు అద్భుతం. ఇక్కడి పరిస్థితులపై అతడికి చక్కటి అవగాహన ఉంది. ఇదే వేదికగా అండర్-19 ఫైనల్‌లో 175 పరుగులు చేయడంతో అతనిలో ఆ ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపించింది. సిరీస్‌కు శుభారంభం దక్కడం ఆనందంగా ఉంది' అని శ్రేయస్ చెప్పుకొచ్చాడు. జట్టు ప్రదర్శనపైనా సంతృప్తి వ్యక్తం చేసిన కెప్టెన్.. బౌలర్లు తమ ప్రణాళికలను సమర్థవంతంగా అమలుచేశారని కొనియాడాడు. పిచ్‌పై మంచి బౌన్స్ లభించడంతో ఆటగాళ్లు పరిస్థితులను చక్కగా సమన్వయం చేసుకోగలిగారన్నాడు.
తొలి మ్యాచ్‌లో విజయోత్సాహంతో ఉన్న భారత జట్టు.. ఇప్పుడు రెండో టీ20పై దృష్టి సారించింది. అదే హరారే వేదికగా రేపు(శనివారం) జరిగే రెండో మ్యాచ్‌లోనూ గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇవీ చదవండి:
వరల్డ్ కప్ డ్రీమ్ టీమ్‌లో వొజిన్హా, హాలాండ్