లవ్లీనాకు పతకం ఖరారు
ABN , Publish Date - Jul 24 , 2026 | 04:48 AM
కామన్వెల్త్ క్రీడల తొలిరోజు భారత్‌కు శుభారంభం దక్కింది. లాన్‌బౌల్స్‌లో విజయాలతో మొదలు పెట్టగా, బాక్సింగ్‌లో బరిలోకి దిగకుండానే స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ తొలి కామన్వెల్త్ పతకాన్ని...
నేరుగా సెమీ్‌సకు బై
కామన్వెల్త్ క్రీడలు
గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల తొలిరోజు భారత్‌కు శుభారంభం దక్కింది. లాన్‌బౌల్స్‌లో విజయాలతో మొదలు పెట్టగా, బాక్సింగ్‌లో బరిలోకి దిగకుండానే స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ తొలి కామన్వెల్త్ పతకాన్ని ఖరారు చేసింది. యువ బాక్సర్లు ప్రీతి పవార్ (54 కిలోలు), జాస్మిన్ లంబోరియా (57 కి), ప్రియ ఘంఘాస్ (60 కి)కి కూడా తొలి రౌండ్ బై లభించింది. కాగా, శుక్రవారం జరిగే పురుషుల తొలి రౌండ్‌లో ఆరోన్ కుల్లెన్ (స్కాట్లాండ్)తో జాదూమణి సింగ్ (55 కి.) తలపడనున్నాడు. బాక్సింగ్ మహిళల 75 కిలోల కేటగిరీలో లవ్లీనాకు నేరుగా సెమీ్‌సకు బై లభించడంతో.. ఆమెకు కనీసం కాంస్యం ఖాయమైంది. కానీ, ఫైనల్ చేరి దేశానికి స్వర్ణం అందించాలని బోర్గోహైన్ పట్టుదలతో ఉంది. ఈ నెల 31న జరిగే సెమీ్‌సలో తరోనా ఖానుమ్ (టువాలు)తో లవ్లీనా అమీతుమీ తేల్చుకోనుంది. గత బర్మింగ్‌హామ్ క్రీడల్లో మహిళా బాక్సర్లు రెండు స్వర్ణ, ఓ కాంస్యం అందించారు. కాగా సెలెక్షన్ ట్రయల్స్‌లో వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్‌ను ఓడించిన సాక్షి చౌదరి (51 కి)పై కూడా భారీ అంచనాలున్నాయి.
సోనోవాల్ సంచలనం..: కామన్వెల్త్ క్రీడలను భారత్ గెలుపుతో ఆరంభించింది. మహిళల లాన్ బౌల్స్ సెక్షన్-బి తొలి రౌండ్‌లో రూపారాణి టిర్కే, పింకీ సింగ్ జంట ఉత్కంఠభరితంగా సాగిన టైబ్రేక్‌లో మాల్టాపై గెలిచింది. రూప-పింకీ జోడీ తొలి సెట్‌ను 7-1తో సునాయాసంగా నెగ్గింది. కానీ, రెండో సెట్‌లో పోరాడిన మాల్టా జంట రెబెక్కా లూయిస్- కొన్నై లే రిక్సన్ 4-3తో నెగ్గడంతో ఫలితం టైబ్రేక్‌కు దారితీసింది. ఇందులో భారత ద్వయం 1-0తో గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకొంది. పురుషుల సింగిల్స్ సెక్షన్-డి తొలి రౌండ్‌లో పుతుల్ సోనోవాల్ టైబ్రేక్‌లో 2023 చాంపియన్ ర్యాన్ బెస్టర్ (కెనడా)కు షాకిచ్చాడు. తొలి సెట్‌ను సోనోవాల్ 5-4తో సొంతం చేసుకోగా.. రెండో సెట్‌ను ర్యాన్ 7-3తో దక్కించుకొన్నాడు. 1-1తో సమం కావడంతో టైబ్రేక్ అనివార్యమైంది. ఇందులో బెస్టర్‌ను సోనోవాల్ కంగు తినిపించాడు.
డోపింగ్‌లో దొరికిన అర్జున్: జుడోకా అరుణ్ కుమార్ (73 కిలోలు) డోపింగ్‌లో పట్టుబట్టాడు. పోటీలు లేని సమయంలో చేసిన పరీక్షలో అతడు నిషేధిత ఉత్ర్పేరకం వాడినట్టు తేలింది. అరుణ్‌పై నాడా తాత్కాలికంగా నిషేధం విధించింది. దీంతో అతడిని భారత బృందం నుంచి తప్పించినట్టు అధికారులు తెలిపారు.
నేటి షెడ్యూల్
లాన్ బౌల్స్: మహిళల పెయిర్స్ సెక్షన్-బి, రౌండ్-2- రాత్రి 7.30; పురుషుల సింగిల్స్ రౌండ్-2 - రా. 10.20
ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్: పురుషుల టీమ్, వ్యక్తిగత క్వాలిఫికేషన్-మ. 2.30 (తాపేశ్వరనాథ్ దాస్, స్వాతిష్ కైతేరి, తపన్ మొహంతి, యోగేశ్వర్ సింగ్).
బాక్సింగ్: పురుషుల 55 కిలోల రౌండ్-32 - రా. 11గం; ఆరోన్ కుల్లెన్ (స్కాట్లాండ్)తో జాదూమణి.
స్విమ్మింగ్, పారా స్విమ్మింగ్: పురుషుల 50 మీ. బ్యాక్‌స్ట్రోక్ హీట్-4-మ. 3.56 (శ్రీహరి నటరాజన్); పారాలో పురుషుల ఫ్రీస్టయిల్ ఎస్13 హీట్-1- మ. 3.40 (రవి)
పారా పవర్‌లిఫ్టింగ్: పురుషుల లైట్‌వెయిట్- సా. 5.40 (అశోక్, పరమ్‌జీత్ కుమార్); మహిళల లైట్‌వెయిట్ - రా. 7.24 (జస్‌ప్రీత్ కౌర్, సుమన్ దేవి); మహిళల హెవీవెయిట్- రా. 10.40 (కస్తూరి రాజమణి); పురుషుల హెవీవెయిట్ - రా. 12.29 (ఝాండూ, సుధీర్)
ఈ వార్తలనూ చదవండి:
ఇన్‌స్టా స్టోరీలో 'కాక్రోచ్' పోస్ట్.. వివాదంలో ఆర్ఏఎఫ్ ఆఫీసర్ సోనియా!
ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ నిరసన.. వాంగ్‌చుక్ భార్య విమర్శలు