Share News

వాటర్‌ బిల్‌ పేరుతో సైబర్‌ మోసాలు

ABN , Publish Date - Oct 06 , 2026 | 09:53 AM

వాటర్‌బిల్‌ అప్‌డేట్‌, బిల్లు బకాయి, కనెక్షన్‌ తొలగింపు తదితర పేర్లతో వినియోగదారులను సైబర్‌ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారని, మొబైల్స్‌కు వారు పంపే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాటర్‌బోర్డు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.

వాటర్‌ బిల్‌ పేరుతో సైబర్‌ మోసాలు
Water Bill Cyber Fraud

  • అప్రమత్తంగా ఉండాలి: వాటర్‌బోర్డు

హైదరాబాద్‌ సిటీ: వాటర్‌బిల్‌ అప్‌డేట్‌, బిల్లు బకాయి, కనెక్షన్‌ తొలగింపు తదితర పేర్లతో వినియోగదారులను సైబర్‌ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారని, మొబైల్స్‌కు వారు పంపే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాటర్‌బోర్డు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. వాటర్‌బోర్డు పేరుతో కానీ, వాటర్‌బిల్‌ అప్‌డేట్‌ పేరుతో ఫోన్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌, వాట్సాప్‌ సందేశాలు పంపి, లింకులు లేదా ఏపీకే ఫైల్స్‌ను డౌన్‌లోడ్‌ చేయాలని కోరితే సంప్రదించవద్దని సూచించింది.


city5.2.jpgఅలాగే మొబైల్‌లో ఏదైనా యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయాలని, స్ర్కీన్‌ షేరింగ్‌ లేదా రిమోట్‌ యాక్సెస్‌ ఇవ్వాలని కోరినా అనుమతించొద్దని పేర్కొంది. ముఖ్యంగా ఓటీపీ, యూపీఐ పిన్‌నంబర్‌, డెబిట్‌, క్రెడిట్‌ కార్డు నంబర్‌, సీవీవీ, పాస్‌వర్డ్‌ వంటి రహస్య సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు వెళ్లడించొద్దని స్పష్టం చేసింది. నీటి బిల్లుల చెల్లింపు, బిల్లు వివరాల పరిశీలనకు వాటర్‌బోర్డు అధికారికంగా అందుబాటులో ఉంచిన మార్గాలను మాత్రమే వినియోగించాలని సూచించింది. ఏదైనా అనుమానాస్పద లావాదేవీ జరిగినట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత బ్యాంకును, సైబర్‌ క్రైమ్‌ పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరింది.


ఈ వార్తలు కూడా చదవండి:

సీపీఐతో చర్చించాకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతుపై నిర్ణయం: తమ్మినేని

‘మహాలక్ష్మి’కి మస్త్‌ డిమాండ్‌!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 06 , 2026 | 09:53 AM