Share News

హోటళ్లే అడ్డాగా.. అమ్మాయిల హత్యలు

ABN , Publish Date - Oct 06 , 2026 | 09:23 AM

ప్రేమ పేరుతో వంచించి, పెళ్లి చేసుకుంటామని నమ్మిస్తున్నారు. తీరా అమ్మాయి పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి ఆగ్రహానికి గురవుతున్నారు.

హోటళ్లే అడ్డాగా.. అమ్మాయిల హత్యలు
Hotel, Lodge Murders

  • 9 రోజుల్లో మూడు మర్డర్‌లు

  • పెళ్లి ప్రస్తావనతో వాగ్వాదాలు.. ఆపై హత్యలు

  • వరుస ఘటనలతో తల్లిదండ్రుల కలవరం

హైదరాబాద్‌ సిటీ: ప్రేమ పేరుతో వంచించి, పెళ్లి చేసుకుంటామని నమ్మిస్తున్నారు. తీరా అమ్మాయి పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి ఆగ్రహానికి గురవుతున్నారు. వారిని అడ్డు తొలగించుకునేందుకు మాట్లాడుకుందామని హోటళ్లకు, లాడ్జిలకు పిలిచి దారుణంగా హతమారుస్తున్నారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు అనేకం జరిగినప్పటికీ.. ఇటీవల 9 రోజుల వ్యవధిలోనే నగరంలో ముగ్గురు యువతులు ప్రేమికుల చేతిలో దారుణ హత్యలకు గురవడం తల్లిదండ్రులను తీవ్రంగా కలిచి వేస్తోంది.


city4.2.jpgవైజాగ్‌ నుంచి వచ్చి..

సెప్టెంబరు-22 : నగరంలో ఓ ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తున్న యువతిని విశాఖపట్నంకు చెందిన శ్రీనివాస రవితేజ ప్రేమించాడు. హైదరాబాద్‌కు వచ్చి ఆమెను మాదాపూర్‌ పరిధిలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ పెళ్లి విషయంలో వాగ్వాదం జరగడంతో కోపంతో అతను ఆమెపై దాడికి చేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లు హోటల్‌ సిబ్బంది సహకారంతో ఆస్పత్రికి తరలించగా ఆమె మృతిచెందింది. దీంతో అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడిని నాలుగు రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేశారు.


లాడ్జిలో..

సెప్టెంబరు-29 : ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఒక లాడ్జిలో ఇటీవల మహిళ దారుణ హత్యకు గురైంది. ప్రేమ పెళ్లి పేరుతో వంచించిన వికారాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌ అదే ప్రాంతానికి చెందిన శిరీషను హైదరాబాద్‌కు తీసుకొచ్చి లాడ్జిలో దిగాడు. పెళ్లి విషయంపై ఇద్దరి మధ్యా వాగ్వాదం జరగడంతో ఆగ్రహానికి లోనైన అతను తన ప్రియురాలిని దారుణంగా హత్య చేసి పరారయ్యాడు.


city4.4.jpgవైద్య విద్యార్థిని హత్య..

అక్టోబరు-1: ఎంబీబీఎస్‌ చదువుతున్న రవి, ఓ యువతి ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఆరేళ్ల ఈ ప్రేమబంధం ఇటీవల విడిపోయింది. అయితే ప్రేమగా ఉన్నప్పుడు ఇచ్చిన బంగారు గొలుసు తిరిగి ఇచ్చేయాలని ఆ యువతి కోరింది. తనను దూరం పెట్టిందని కక్షపెంచుకున్న యువకుడు.. మియాపూర్‌ పరిధిలో ఓ హోటల్లో అద్దెకు దిగి ఆ యువతిని అక్కడికి పిలిచాడు. అదే రోజు ఆమెను దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.


city4.3.jpgఈ వార్తలు కూడా చదవండి:

సీపీఐతో చర్చించాకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతుపై నిర్ణయం: తమ్మినేని

‘మహాలక్ష్మి’కి మస్త్‌ డిమాండ్‌!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 06 , 2026 | 09:29 AM