Share News

సీపీఐతో చర్చించాకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతుపై నిర్ణయం: తమ్మినేని

ABN , Publish Date - Oct 06 , 2026 | 06:52 AM

త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలన్న దానిపై సీపీఐతో చర్చించిన తర్వాతే తమ నిర్ణయం ప్రకటిస్తామని సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.

సీపీఐతో చర్చించాకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతుపై నిర్ణయం: తమ్మినేని
Tammineni Veerabhadram

ఖమ్మం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలన్న దానిపై సీపీఐతో చర్చించిన తర్వాతే తమ నిర్ణయం ప్రకటిస్తామని సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. కాంగ్రెస్‌ తమను సంప్రదించలేదని, బీఆర్‌ఎస్‌ ఇప్పటికే తమ మద్దతు కోరిందని, అయితే తాము ఎటూ చెప్పలేదని తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలా లేక ఎవరికైనా మద్దతు ఇవ్వాలా అన్నది త్వరలోనే ప్రకటిస్తామని వివరించారు.


ఖమ్మంలో సోమవారం టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో ‘మీట్‌ ది ప్రెస్‌’లో జర్నలిస్టుల ప్రశ్నలకు తమ్మినేని సమాధానమిచ్చారు. 2024లో కాంగ్రె్‌సతో పొత్తు చెడిపోవడానికి పాలేరు నియోజకవర్గం ఒక్కటే కారణం కాదని, మొదట రెండుసీట్లు ఇస్తామని చెప్పి తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ఒక్కసీటుకు కూడా సరైన హామీ ఇవ్వలేదన్నారు. కమ్యూనిస్టుల ఐక్యతకు, విలీనానికి సీపీఎం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ అధికార కాంక్షతో ఇండియా కూటమిలో ఉన్న పార్టీలను కూడా ఓడిస్తోందని, ఇందుకు కేరళం పరిణామాలే నిదర్శనమన్నారు.


ఇవి కూడా చదవండి...
పాదరస కాలుష్యానికి సాంకేతికతతో చెక్‌

రామప్పను కాపాడుకునేందుకు ఉద్యమిస్తాం
వృత్తి నిపుణులను కాంగ్రెస్‌ వైపు మళ్లించండి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 06 , 2026 | 06:52 AM