వృత్తి నిపుణులను కాంగ్రెస్ వైపు మళ్లించండి
ABN , Publish Date - Oct 06 , 2026 | 05:48 AM
దేశంలో అధ్యాపకులు, డాక్టర్లు, ఇంజనీర్లతో పాటు వివిధ రంగాల వృత్తి నిపుణులను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చేందుకు అవసరమైన అన్ని కార్యక్రమాలను చేపట్టాలని ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సూచించారు.
మధుయాష్కీతో రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): దేశంలో అధ్యాపకులు, డాక్టర్లు, ఇంజనీర్లతో పాటు వివిధ రంగాల వృత్తి నిపుణులను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చేందుకు అవసరమైన అన్ని కార్యక్రమాలను చేపట్టాలని ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సూచించారు. సోమవారం ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ నూతన చైర్మన్ మధుయాష్కీ తన కార్యాచరణ ప్రణాళిక గురించి వివరించారు.
భారతీయ జనతా పార్టీ ఇదే విధంగా పార్టీని విస్తరించిందని, ఇప్పుడు అన్ని రంగాల వృత్తి నిపుణుల్లో మోదీ పాలన పట్ల వ్యతిరేకత తీవ్రమవుతున్న రీత్యా కాంగ్రెస్ వారిని కలుపుకునేందుకు విస్తృతస్థాయిలో ప్రయత్నాలు చేయాలని మధుయాష్కీకి రాహుల్ సూచించారు. వ్యవస్థలు నిర్వహించడంలో వృత్తినిపుణుల పాత్ర ఎంత గొప్పదో, వ్యవస్థలు కుప్పకూలిపోకుండా కాపాడేందుకు కూడా వారి అండదండలు అంతే అవసరమని ఆయన చెప్పారు. మధుయాష్కీ చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను రాహుల్ ఆసక్తిగా తిలకించారు.
ఇవి కూడా చదవండి...
ఆకాశంలో బియ్యం, నిత్యావసరాల ధరలు
రామప్పను కాపాడుకునేందుకు ఉద్యమిస్తాం
సోషల్ మీడియాలో సీఎం రేవంత్‌పై తప్పుడు ప్రచారం
Read Latest Telangana News And Telugu News