సోషల్ మీడియాలో సీఎం రేవంత్‌పై తప్పుడు ప్రచారం
ABN , Publish Date - Oct 06 , 2026 | 05:35 AM
సీఎం రేవంత్‌రెడ్డి పరువుకు నష్టం కలిగించే ఆరోపణలతో సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు, సందేశాలను ప్రచారం చేస్తున్నారంటూ.. డీజీపీకి ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ సోమవారం ఫిర్యాదు చేశారు.
చర్యలు తీసుకోవాలని డీజీపీకి బల్మూరి వెంకట్ ఫిర్యాదు
హైదరాబాద్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి పరువుకు నష్టం కలిగించే ఆరోపణలతో సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు, సందేశాలను ప్రచారం చేస్తున్నారంటూ.. డీజీపీకి ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ సోమవారం ఫిర్యాదు చేశారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని కల్పించడంతో పాటు ముఖ్యమంత్రి గౌరవం, ప్రతిష్ఠకు భంగం కలిగించే ఉద్దేశంతోనే ఈ ప్రచారం జరుగుతున్నట్లు ఆయన ఆరోపించారు. సంబంధిత సోషల్ మీడియా పోస్టులు, వీడియోలు, ఖాతాలు, సందేశాలను సైబర్‌క్రైౖమ్ పోలీసులు పరిశీలించేలా ఆదేశించాలని.. ఇలాంటి తప్పుడు, ధ్రువీకరణ లేని సమాచారాన్ని ప్రచారం చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీని విప్ బల్మూరి వెంకట్ కోరారు.
ఫిర్యాదుతో పాటు సంబంధిత సోషల్ మీడియా పోస్టులు, ఇతర ఆధారాలను సమర్పించారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డిపై సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేయిస్తున్నది బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ అని బల్మూరి వెంకట్ ఆరోపించారు. డీజీపీకి ఫిర్యాదు చేయడానికి ముందు సీఎల్పీ మీడియా హాల్లో మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కల్వకుంట్ల కుటుంబ ఆస్తులు ఎలా పెరిగాయో ఆధారాలతో సహా సీఎం రేవంత్‌రెడ్డి బయటపెడితే... దానిపై సమాధానం చెప్పే ధైర్యం లేకే కేటీఆర్ ఇలా తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి...
తెలంగాణలోని కీలక ప్రాజెక్టులకు సహకరించండి
కాళేశ్వరం మరమ్మతులు త్వరగా చేపట్టండి
Read Latest Telangana News And Telugu News