రామప్పను కాపాడుకునేందుకు ఉద్యమిస్తాం
ABN , Publish Date - Oct 06 , 2026 | 05:43 AM
యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం సమీపంలో ఓపెన్‌కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు ప్రతిపాదనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
చారిత్రక సంపదను కూల్చే కుట్రలను అడ్డుకుంటాం: కేటీఆర్
హైదరాబాద్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం సమీపంలో ఓపెన్‌కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు ప్రతిపాదనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టును తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రామప్పను కాపాడుకునేందుకు భారీ ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని సోమవారం ఎక్స్ వేదికగా కేటీఆర్ హెచ్చరించారు. రాష్ట్రంలో భూముల దోపిడీ ముగిసిందన్నట్లుగా, ఇప్పుడు ప్రభుత్వం కన్ను ఖనిజ సంపదపై పడిందని మండిపడ్డారు.
చారిత్రక కట్టడాలను దెబ్బతీసే చర్యలను బీఆర్‌ఎస్ పార్టీ సహించబోదని స్పష్టం చేశారు. రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఓపెన్‌కాస్ట్ బొగ్గుగని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడటం దారుణమన్నారు. మీటర్లకొద్దీ లోతులో తవ్వకాలు, బ్లాస్టింగ్స్ చేయడం వల్ల తెలంగాణ శిల్పకళా వైభవానికి ప్రతీకైన రామప్ప దేవాలయంతో పాటు రామప్ప చెరువు మనుగడకు ముప్పు వాటిల్లుతుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
ఆకాశంలో బియ్యం, నిత్యావసరాల ధరలు
సోషల్ మీడియాలో సీఎం రేవంత్‌పై తప్పుడు ప్రచారం
Read Latest Telangana News And Telugu News