సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ‘ఇండియా’ కూటమి మార్చ్.. ఢిల్లీలో భారీ భద్రత
ABN , Publish Date - Oct 06 , 2026 | 08:55 AM
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని, SIR ప్రక్రియలో అక్రమాలను నిరసిస్తూ ‘ఇండియా’ కూటమి ఎంపీలు పార్లమెంట్ నుంచి నిర్వాచన్ సదన్ వరకు మార్చ్ నిర్వహిస్తోంది. దీంతో ఢిల్లీ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
ఢిల్లీ, అక్టోబర్ 6: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే పదవి నుండి తొలగించాలని, 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) ప్రక్రియలోని అక్రమాలను నిరసిస్తూ 'ఇండియా' (INDIA) కూటమి నిరసన బాట పట్టింది. కాంగ్రస్ ఎంపీలు పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయమైన 'నిర్వాచన్ సదన్' వైపు చేపట్టిన మార్చ్ నేపథ్యంలో రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నిరసనల దృష్ట్యా విజయ్ చౌక్, ఆకాశవాణి పరిసర ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), ఢిల్లీ పోలీసులు బహుళ అంచెల బారికేడ్లను ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. (INDIA Bloc CEC Protest)
పార్లమెంట్ నుంచి నిర్వాచన్ సదన్ వరకు మార్చ్
కూటమికి చెందిన ఎంపీలందరూ ఈ (మంగళవారం) ఉదయం 10:30 గంటలకు పార్లమెంట్‌లోని 'మకర్ ద్వార్' వద్దకు చేరి, ఉదయం 11:00 గంటలకు శాంతియుతంగా ఎన్నికల సంఘం ఆఫీసు వైపు పాదయాత్రగా బయలుదేరాలని నిర్ణయించారు.
కాంగ్రెస్ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్, జైరామ్ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం... అక్టోబర్ 8 వరకు అన్ని జిల్లాల్లో పాదయాత్రలు, సమావేశాలు జరుగుతాయి. ఆ తర్వాత అక్టోబర్ 10 నుంచి దేశవ్యాప్తంగా 'ఓట్ బచావో, దేశ్ బచావో' పేరుతో ఆందోళనలను మరింత తీవ్రతరం చేయనున్నారు.
అటు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 'X' వేదికగా స్పందిస్తూ, సీఈసీ జ్ఞానేష్ కుమార్ చట్టవిరుద్ధంగా, ఏకపక్షంగా 'ఫారమ్ 6' లో మార్పులు చేశారని ఆరోపించారు. భారత ప్రజాస్వామ్యంపై దాడికి పాల్పడుతున్న వారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
'ఆప్' దూరంగా ఉన్నా ప్రత్యేక పోరాటం
ఈ మార్చ్‌ను 'ఇండియా' కూటమి నిర్వహిస్తున్నందున తాము ఇందులో పాల్గొనడంలేదని, అయితే ఈ అంశంపై తమ సొంత మార్గంలో వేరుగా పోరాడుతున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ సంజయ్ సింగ్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్.. నేరస్థుల్లో భయం పుట్టించాలంటూ.
ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యం కోల్పోతోంది.. సంస్కరణలు తప్పనిసరి: జైశంకర్