Share News

ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యం కోల్పోతోంది.. సంస్కరణలు తప్పనిసరి: జైశంకర్

ABN , Publish Date - Oct 05 , 2026 | 10:23 PM

అంతర్జాతీయ సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో ఐక్యరాజ్యసమితి పాత్ర పరిమితమైందని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను ప్రతిబింబించడం లేదని వ్యాఖ్యానించారు.

ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యం కోల్పోతోంది.. సంస్కరణలు తప్పనిసరి: జైశంకర్
Jaishankar UN remarks

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో ఐక్యరాజ్యసమితి పాత్ర పరిమితమైందని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను ప్రతిబింబించడం లేదని వ్యాఖ్యానించారు. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన కౌటిల్య ఆర్థిక సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు (S Jaishankar about United Nations).


ఉక్రెయిన్ యుద్ధం, గల్ఫ్ ప్రాంతంలోని ఘర్షణలు, ఆఫ్రికాలో నెలకొన్న సంక్షోభాలు, కరోనా మహమ్మారి వంటి ప్రధాన అంతర్జాతీయ పరిణామాలను జైశంకర్ ప్రస్తావించారు. ఈ సమస్యలకు సంబంధించిన కీలక నిర్ణయాల విషయంలో ఐక్యరాజ్యసమితి పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, భద్రతలను కాపాడేందుకు ఏర్పాటైన సంస్థలో నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ నిలిచిపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ముఖ్యంగా భద్రతా మండలిలో నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా అంతర్జాతీయ సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు (UN Security Council).


ఇక, ప్రస్తుత భద్రతా మండలి ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ప్రయోజనాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం లేదనే అభిప్రాయం విస్తృతంగా ఉందని జైశంకర్ పేర్కొన్నారు (Jaishankar UN remarks). ఈ పరిస్థితిని మార్చేందుకు సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు. కాగా, ఐక్యరాజ్యసమితి పనితీరుపై విమర్శలు చేసినప్పటికీ, ఆ సంస్థను పూర్తిగా పక్కనపెట్టడం సరైన పరిష్కారం కాదని జైశంకర్ స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు ఇప్పటికీ ఆ సంస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సంస్థ ప్రభావాన్ని పెంచేందుకు సంస్కరణలు తప్పనిసరని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

బాల్కనీ నుంచి కిందపడిన బాలుడు.. క్షణాల్లో స్పందించి కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్..


మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..

Updated Date - Oct 05 , 2026 | 10:23 PM