Share News

బాల్కనీ నుంచి కిందపడిన బాలుడు.. క్షణాల్లో స్పందించి కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్..

ABN , Publish Date - Oct 05 , 2026 | 02:38 PM

ఈజిప్టులో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండో అంతస్తు బాల్కనీ నుంచి ఓ చిన్న బాలుడు కిందపడుతుండగా.. అక్కడే ఉన్న ఓ వ్యక్తి క్షణాల్లో స్పందించాడు.

బాల్కనీ నుంచి కిందపడిన బాలుడు.. క్షణాల్లో స్పందించి కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్..
Egyptian man saves boy

ఇంటర్నెట్ డెస్క్: ఈజిప్టులో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండో అంతస్తు బాల్కనీ నుంచి ఓ చిన్న బాలుడు కిందపడుతుండగా.. అక్కడే ఉన్న ఓ వ్యక్తి క్షణాల్లో స్పందించాడు. అత్యంత వేగంగా స్పందించిన ఆ వ్యక్తి బాలుడి ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Egyptian man saves boy).


ఈజిప్టులోని గిజా గవర్నరేట్‌లోని అర్డ్ ఎల్-లెవాకు చెందిన అహ్మద్ రగబ్ తన దుకాణం దగ్గర ఉన్నాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న భవనం పై నుంచి అరుపులు, కేకలు వినిపించాయి. అతను పైకి చూసేసరికి ఓ చిన్నారి బాల్కనీ నుంచి కిందపడుతున్నాడు. రగబ్ వెంటనే స్పందించి బాలుడి వైపు పరుగెత్తాడు. బాలుడు కిందకు పడుతున్న సమయంలో సరైన స్థానంలోకి చేరుకుని అతడిని పట్టుకున్నాడు. దీంతో ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు (Balcony fall rescue).


బాలుడిని రక్షించేందుకు ఏ చేయాలో ఆలోచించే సమయం కూడా తనకు లేదని అహ్మద్ రగబ్ చెప్పాడు (Egypt viral video). బాలుడు నేలను ఢీకొట్టేలోపు అతడిని రక్షించాలనే ఆలోచనతోనే వెంటనే పరుగెత్తానని వివరించాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన వెంటనే రగబ్ స్పందించిన తీరు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.


ఇవి కూడా చదవండి...

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారంటూ వృద్ధుడికి బెదిరింపులు.. లక్షల్లో వసూలు

విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు శంకుస్థాపన.. 4 వేల మంది కళాకారులతో భారీ కార్నివాల్

Updated Date - Oct 05 , 2026 | 02:43 PM