Share News

మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..

ABN , Publish Date - Oct 05 , 2026 | 03:21 PM

అస్సాంలో ప్రభుత్వ పాఠశాలల సందర్శనలపై ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ , కాక్రోచ్ జనతా పార్టీ మధ్య మాటల యుద్ధం మొదలైంది.

మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..
Assam school visits

ఇంటర్నెట్ డెస్క్: అస్సాంలో ప్రభుత్వ పాఠశాలల సందర్శనలపై ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (AASU), కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించేందుకు సీజేపీ చేపట్టిన 'స్కూల్ థిక్ కరో' కార్యక్రమంపై ఏఏఎస్‌యూ అభ్యంతరం వ్యక్తం చేసింది (CJP Assam school visits).


సీజేపీ చేస్తున్న సందర్శనల కారణంగా రాష్ట్రంలో అస్థిర పరిస్థితులకు దారితీయవచ్చని ఏఏఎస్‌యూ ప్రధాన కార్యదర్శి సమీరన్ ఫుకాన్ వ్యాఖ్యానించారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులు వివిధ నెట్‌వర్క్‌లను ఉపయోగించి మాదకద్రవ్యాల సమస్యను పెంచుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో పాఠశాలల్లోకి వెళ్లి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఎవరైనా రాష్ట్ర శాంతికి భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారా అనే సందేహం ఉందని వ్యాఖ్యానించారు (School Thik Karo campaign).


ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు సీజేపీ 'స్కూల్ థిక్ కరో' కార్యక్రమాన్ని ప్రారంభించింది. పాఠశాలల్లో మౌలిక వసతులు, మరుగుదొడ్లు, తాగునీరు, తరగతి గదులు, విద్యా వాతావరణం వంటి అంశాలను పరిశీలించడంతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడుతున్నట్లు సీజేపీ చెబుతోంది. సీజేపీ సహ కన్వీనర్ ఆశుతోష్ రంకా నేతృత్వంలో అస్సాంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. కొన్ని పాఠశాలల్లో మౌలిక వసతుల పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తారు (CJP school inspection).


ఏఏఎస్‌యూ వ్యాఖ్యలపై సీజేపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చారిత్రకంగా అసోం ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి సంఘం నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం నిరాశ కలిగించిందని పేర్కొంది. పాఠశాలల్లో మౌలిక వసతుల సమస్యలపై దృష్టి పెట్టడమే తమ కార్యక్రమం ఉద్దేశమని సీజేపీ స్పష్టం చేసింది. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి విద్యార్థుల సమస్యలపై కలిసి పనిచేయాలని పిలుపునిచ్చింది. తమ 'స్కూల్ థిక్ కరో' కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఏఏఎస్‌యూను సీజేపీ ఆహ్వానించింది.


ఇవి కూడా చదవండి...

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారంటూ వృద్ధుడికి బెదిరింపులు.. లక్షల్లో వసూలు

విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు శంకుస్థాపన.. 4 వేల మంది కళాకారులతో భారీ కార్నివాల్

Updated Date - Oct 05 , 2026 | 03:21 PM