Share News

మేడ్చల్‌లో బంగారం షాపు చోరీ కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు

ABN , Publish Date - Oct 06 , 2026 | 07:53 AM

మేడ్చల్‌లోని క్యారెట్‌లేన్ బంగారం షాపులో ఆభరణాల చోరీ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితుల కోసం వారు గాలిస్తున్నారు. ఈ చోరీకి పాల్పడింది బిహార్‌కు చెందిన వారని పోలీసులు అనుమానిస్తున్నారు.

మేడ్చల్‌లో బంగారం షాపు చోరీ కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు

హైదరాబాద్, అక్టోబర్ 06: మేడ్చల్‌లోని క్యారెట్‌లేన్ బంగారం షాపులో ఆభరణాల చోరీ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితుల కోసం వారు గాలిస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశారు. ఈ చోరీకి పాల్పడింది బిహార్‌కు చెందిన వారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ షాపులో మొత్తం ఏడుగురు పనిచేస్తుండగా.. వారిలో ముగ్గురు వ్యక్తులు ఇటీవల ఉద్యోగం మానేసినట్లు పోలీసులు విచారణలో షాపు సిబ్బంది వెల్లడించారు. ఈ చోరీలో వారి ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ చోరీ చేసే సమయంలో సీసీటీవీ కెమెరా, అలారం వైర్లను దొంగలు కట్ చేశారు. అలాగే షట్టర్లను ఇనుప రాడ్లతో బద్దలు కొట్టారు. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో రూ.2.5 కోట్ల విలువైన 580 బంగారు ఆభరణాలను రెండు బ్యాగుల్లో వారు నింపుకున్నారు. కేవలం11 నిమిషాల్లో ఈ దోపిడీ పూర్తి చేసిన వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ షాపు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. సోమవారం అర్ధరాత్రి ఈ చోరీ జరిగింది.


ఈ వార్తలు కూడా చదవండి..

సంగారెడ్డి జిల్లాలో మూడు ఎకరాల మామిడితోట దగ్ధం..

యాసంగిలో స్వల్పకాలిక పంటలు సాగు చేయాలి

Updated Date - Oct 06 , 2026 | 08:02 AM