Share News

యాసంగిలో స్వల్పకాలిక పంటలు సాగు చేయాలి

ABN , Publish Date - Oct 06 , 2026 | 06:58 AM

ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వరికి ప్రత్యామ్నాయంగా తక్కువ నీటి వనరులతో సాగయ్యే పంటలను ఈ యాసంగి సీజన్‌లో ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్‌ అధికారులను ఆదేశించారు.

యాసంగిలో స్వల్పకాలిక పంటలు సాగు చేయాలి
Telangana Yasangi crops

  • రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్‌

హైదరాబాద్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వరికి ప్రత్యామ్నాయంగా తక్కువ నీటి వనరులతో సాగయ్యే పంటలను ఈ యాసంగి సీజన్‌లో ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్‌ అధికారులను ఆదేశించారు. వివిధ జిల్లాల వ్యవసాయశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.


స్వల్పకాలిక రకాలైన పప్పు ధాన్యాలు, నూనె గింజలతోపాటు అధిక ఆదాయాన్నిచ్చే కూరగాయల పంటలు సాగు చేయాలని సూచించారు. రైతులకు అందుబాటులో ఉన్న నీటి వనరులు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించి, యాసంగి సీజన్‌లో పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.


ఇవి కూడా చదవండి...
మార్వాడీ వ్యాపారి దారుణ హత్య!

ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ‘ఫ్రీ ఎగ్జిట్‌’ అవకాశం
కాళేశ్వరం మరమ్మతులు త్వరగా చేపట్టండి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 06 , 2026 | 06:58 AM