మార్వాడీ వ్యాపారి దారుణ హత్య!
ABN , Publish Date - Oct 06 , 2026 | 05:11 AM
మేడ్చల్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో ఒక మార్వాడీ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడి మర్మాంగాలపై బలంగా దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
శుక్రవారం కనిపించకుండా పోయిన నేమారాం చౌదరి
ఆదివారం మురహరి చెరువు కట్టపై అతడి శవం గుర్తింపు
మర్మాంగాలపై బలంగా దాడి చేసి హత్య
హైదరాబాద్ సిటీ/పేట్ బషీరాబాద్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో ఒక మార్వాడీ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడి మర్మాంగాలపై బలంగా దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాజస్థాన్‌లోని పాలి జిల్లా మండ గ్రామానికి చెందిన నేమారాం చౌదరి(55) తన కుటుంబంతో కలిసి కొన్నేళ్ల క్రితం బోయిన్‌పల్లిలోని హస్మత్‌పేట్‌కు వలస వచ్చాడు. ఎల్బీనగర్‌లో లైట్ల వ్యాపారంతోపాటు చిట్టీల దందా నిర్వహిస్తున్నాడు. ఏడు నెలల క్రితం గుండ్లపోచంపల్లిలో హార్డ్‌వేర్ షాపు ప్రారంభించి అక్కడే నివసిస్తున్నాడు. అతడి కుమారులిద్దరు బోయిన్‌పల్లిలో ఉంటున్నారు. నేమారాం చౌదరి ఈ నెల 2న ఉదయం ద్విచక్రవాహనంపై కుమారుల వద్దకు వెళ్లాడు. మూడు గంటల తర్వాత తిరుగు పయనమైనా ఇంటికి చేరలేదు. అతని మొబైల్ కూడా పనిచేయకపోవడంతో కుటుంబసభ్యులు శనివారం పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
4వ తేదీన సాయంత్రం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మురహరిపల్లి చెరువు కట్టపై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉందని స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి నేమారాం చౌదరిగా గుర్తించి కేసును పేట్ బషీరాబాద్‌కు బదిలీ చేశారు. నేమారాంను గుర్తుతెలియని వ్యక్తులు పథకం ప్రకారమే తీసుకెళ్లి హత్య చేశారని ప్రాథమికంగా నిర్ధారించారు. శుక్రవారం మృతుడు అల్వాల్ బ్రిడ్జి వద్దకు వెళ్లి, అక్కడ ఒక కాటన్ బాక్సు పట్టుకొని గుర్తు తెలియని థార్ వాహనంలో వెళ్లడం వరకు గుర్తించామని మేడ్చల్ అదనపు డీసీపీ పురుషోత్తం, ఏసీపీ శంకర్‌రెడ్డి తెలిపారు. ఆ తర్వాత ఏం జరిగిందనే అంశంపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు.
పోలీసుల నిర్లక్ష్య వల్లనే నేమారాం చౌదరి హత్యకు గురయ్యాడని ఆగ్రహం వ్యక్తంచేస్తూ దాదాపు 200 మంది మార్వాడీలు పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ ముందు సోమవారం ఆందోళనకు దిగారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఈ హత్య జరిగి ఉండేదని కాదని ఆరోపించారు. ఇంటి నుంచి వెళ్లినప్పుడు నేమారామ్ రూ.10 లక్షల నగదు తీసుకెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
సింథటిక్ డ్రగ్స్‌పై ఉక్కుపాదం
క్యారెట్‌లేన్ జ్యూవెలరీ షాపులో భారీ చోరీ
17 ఏళ్ల ట్రైనీ నర్స్‌పై హాస్పిటల్ ఎండీ లైంగిక దాడి
Read Latest Telangana News And Telugu News