క్యారెట్‌లేన్ జ్యూవెలరీ షాపులో భారీ చోరీ
ABN , Publish Date - Oct 06 , 2026 | 05:01 AM
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రముఖ నగల దుకాణంలో సోమవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. వాహన రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే ..
రూ. 2 కోట్ల వజ్రాభరణాలు ఎత్తుకెళ్లిన ముఠా
మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో ఘటన
పీర్జాదిగూడ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రముఖ నగల దుకాణంలో సోమవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. వాహన రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే వరంగల్ జాతీయ రహదారి పిల్లర్ నెంబర్ 90 పక్కనే ఉన్న ‘క్యారెట్‌లేన్ టాటా జ్యూవెలరీ’ షోరూంలోకి చొరబడిన దొంగలు, ఐదు నిమిషాల వ్యవధిలోనే దాదాపు రూ. 2కోట్ల విలువైన వజ్రాభరణాలు దోచుకెళ్లారు. ఈ దొంగతనంలో మొత్తం ఏడుగురు సభ్యులు పాల్గొని షాపు షట్టరును ఐరన్ రాడ్లతో బద్దలు కొట్టి పైకి లేపారు. అందులో ఒక వ్యక్తి మాత్రమే లోపలికి ప్రవేశించి కంటపడిన అభరణాలను మూట కట్టుకుని బయటపడ్డాడు.
మిగిలిన ఆరుగురు బయట కాపలా ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. అనంతరం వారంతా కాలినడకన హైవే మరోవైపుకు వెళ్లి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్లూస్‌టీమ్‌తో వివరాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆధారాలను విశ్లేషిస్తున్నామని, నిందితుల ఆచూకీ కోసం 5 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని డీసీపీ సురేష్, ఏసీపీ మోహన్‌కుమార్, సీఐ జలందర్ రెడ్డిలు తెలిపారు. దొంగతనానికి ముందు దోపిడిదారులు పక్కాగా రెక్కీ నిర్వహించి ప్లాన్ చేసినట్లు వారు అనుమానిస్తున్నారు. లేదా ఎవరైనా ఇంటి దొంగలే సమాచారాన్ని అందించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
సింథటిక్ డ్రగ్స్‌పై ఉక్కుపాదం
Read Latest Telangana News And Telugu News