Share News

17 ఏళ్ల ట్రైనీ నర్స్‌పై హాస్పిటల్‌ ఎండీ లైంగిక దాడి

ABN , Publish Date - Oct 06 , 2026 | 05:06 AM

ట్రైనీ నర్సుగా చేరిన బాలిక(17)ను మభ్య పెట్టి, మాయ మాటలు చెప్పి.. ఆమెపై ఆస్పత్రి ఎండీ పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌లో సోమవారం చోటు చేసుకుంది.

17 ఏళ్ల ట్రైనీ నర్స్‌పై హాస్పిటల్‌ ఎండీ లైంగిక దాడి
POCSO case

  • నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు

నేరేడ్‌మెట్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ట్రైనీ నర్సుగా చేరిన బాలిక(17)ను మభ్య పెట్టి, మాయ మాటలు చెప్పి.. ఆమెపై ఆస్పత్రి ఎండీ పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌లో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నేరేడ్‌మెట్‌లోని శ్రీసాయి శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఎండీ తార్యా నాయక్‌.. తన ఆస్పత్రిలో పని చేస్తున్న ట్రైనీ నర్సుపై కన్నేశాడు.


మభ్య పెట్టి పలుమార్లు లైంగిక దాడి చేసిన తార్యా నాయక్‌ వేధింపులు పెరగడంతో తల్లికి బాధితురాలు వివరించింది. రంగంలోకి దిగిన పోలీసులు.. అతడిపై ఫొక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. నిందితుడ్ని సోమవారం అరెస్టు చేసి, రిమాండ్‌పై తరలించినట్లు చెప్పారు.


ఇవి కూడా చదవండి...
సింథటిక్‌ డ్రగ్స్‌పై ఉక్కుపాదం

క్యారెట్‌లేన్‌ జ్యూవెలరీ షాపులో భారీ చోరీ
సైబర్‌ నేరగాళ్ల పంజా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 06 , 2026 | 05:06 AM