సంగారెడ్డి జిల్లాలో మూడు ఎకరాల మామిడితోట దగ్ధం..
ABN , Publish Date - Oct 06 , 2026 | 07:15 AM
సంగారెడ్డి జిల్లాలోని పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట గ్రామ శివారులో మూడు ఎకరాల మామిడితోట అగ్నికి ఆహుతి అయింది. మంగళవారం తెల్లవారుజామున మామిడి తోటలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
సంగారెడ్డి, అక్టోబర్ 06: జిల్లాలోని పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట గ్రామ శివారులో మూడు ఎకరాల మామిడితోట అగ్నికి ఆహుతి అయింది. మంగళవారం తెల్లవారుజామున మామిడి తోటలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్దారెడ్డిపేట గ్రామస్తులు వెంటనే అగ్నిమాపక సిబ్బందితోపాటు పోలీసులకు సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరిన అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు యత్నిస్తున్నారు.
ఈ అగ్నిప్రమాదంలో మామిడి, జామ, కొబ్బరి చెట్లతోపాటు డ్రిప్ పైప్ లైన్ మొత్తం దగ్ధమైందని తోట యాజమాని వెల్లడించారు. మొత్తం రూ.10 లక్షల రూపాయిల నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముద్దాయిపేట గ్రామానికి చెందిన పశువుల కాపరి సుదర్శన్.. తోటకు ఉద్దేశపూర్వకంగా నిప్పంటించినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
యాసంగిలో స్వల్పకాలిక పంటలు సాగు చేయాలి
రేపటి నుంచి గురజాడ నాటక శిక్షణ