Share News

రేపటి నుంచి గురజాడ నాటక శిక్షణ

ABN , Publish Date - Oct 06 , 2026 | 07:10 AM

రాష్ట్రంలో రంగస్థల కళలను ప్రోత్సహించేందుకు ’గురజాడ నాటక శిక్షణ’ పేరుతో శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది.

రేపటి నుంచి గురజాడ నాటక శిక్షణ

అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రంగస్థల కళలను ప్రోత్సహించేందుకు ’గురజాడ నాటక శిక్షణ’ పేరుతో శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ నెల 7 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పిల్లలు, యువత, నాటక రచయితలు, దర్శకులు, మేకప్‌ ఆర్టిస్టులు, సాంకేతిక సిబ్బందికి నైపుణ్యాలు పెంపొందించేలా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. శిక్షకులకు గౌరవ వేతనంతో పాటు ఇతర ఖర్చుల కోసం రూ.20 లక్షలు విడుదల చేసింది.

ఈ వార్తలనూ చదవండి:

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్

ఏపీలో నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

Updated Date - Oct 06 , 2026 | 07:10 AM