Share News

బారికేడ్‌ను ఇలాక్కూడా వాడతారని ఇప్పుడే తెలిసింది.. వీళ్ల నిర్వాకం చూస్తే..

ABN , Publish Date - Oct 06 , 2026 | 08:03 AM

వరద నీరు రోడ్లను ముంచెత్తితే బయటకు వెళ్లడం కష్టమే.. కానీ ఈ యువకులు మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు. చేతిలో ఉన్న పోలీసు బారికేడ్‌నే తాత్కాలిక పడవగా మార్చేసి వరద నీటిలో ప్రయాణించారు.

బారికేడ్‌ను ఇలాక్కూడా వాడతారని ఇప్పుడే తెలిసింది.. వీళ్ల నిర్వాకం చూస్తే..
Flood Water

ఇంటర్నెట్ డెస్క్: వరద నీటితో రోడ్లు పూర్తిగా మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. కొందరు మాత్రం తమదైన తెలివితో సమస్యకు వినూత్న పరిష్కారం కనుగొన్నారు. వైరల్ అవుతున్న వీడియోలో రోడ్లపై మోకాళ్ల లోతు వరద నీరు ప్రవహిస్తుండగా, పోలీసుల బారికేడ్‌ను తాత్కాలిక పడవగా మార్చిన పిల్లల తీరు నవ్వులు పూయిస్తోంది. సారన్ పోలీసులు రోడ్డు పక్కన ఉంచిన బరువైన బారికేడ్‌ను నీటిలోకి లాగి.. దానిపై తమ సామాన్లు, బరువైన సంచులను పెట్టారు. ఆపై ఒక బాలుడు బారికేడ్‌పై కూర్చోగా, మరో బాలుడు దానిని ముందుకు నెడుతూ వెళ్లాడు.


ఈ వినూత్న జుగాడ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విపత్కర పరిస్థితుల్లోనూ ఇలా తమకు అనుకూలంగా పరిష్కారం వెతుక్కోవడంపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. పోలీసు బారికేడ్‌ను ఇలా ఉపయోగించడం చూసి కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు ‘బీహార్‌లో జుగాడ్‌కు కొదవే లేదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. విపత్తు సమయంలోనూ సానుకూలతను, నవ్వును వెతుక్కోవడానికి ఇదొక ఉదాహరణ అంటూ మరికొందరు పేర్కొంటున్నారు. మొత్తానికి వరద నీటిలో బారికేడ్‌ను పడవగా మార్చిన పిల్లల వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి

అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్.. నేరస్థుల్లో భయం పుట్టించాలంటూ..

మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..

Updated Date - Oct 06 , 2026 | 09:00 AM