త్వరలో స్మార్ట్ మీటర్లు
ABN , Publish Date - Oct 06 , 2026 | 08:13 AM
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ త్వరలో స్మార్ట్ మీటర్లు అందుబాటులోకి తీసుకువచ్చేదిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
మొదటి దశలో 15 కిలోవాట్ల లోడ్ కలిగిన విద్యుత్ కనెక్షన్లకు ఏర్పాటు
రాబోయే రోజుల్లో కొత్త కనెక్షన్లకు
నవంబరు నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టీజీఎస్పీడీసీఎల్ ప్రణాళికలు
హైదరాబాద్ సిటీ: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ త్వరలో స్మార్ట్ మీటర్లు అందుబాటులోకి తీసుకువచ్చేదిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మొదటి దశలో 15 కిలో వాట్ల లోడ్ కలిగిన విద్యుత్ కనెక్షన్లకు అమర్చి, తర్వాత కొత్తగా జారీచేస్తున్న 5, 10 కిలోవాట్ల విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలని టీజీఎస్పీడీసీఎల్ భావిస్తోంది. స్మార్ట్ మీటర్లు అందుబాటులోకి వచ్చినా ప్రస్తుత పద్ధతిలోనే బిల్లులు జారీచేస్తామని అధికారులు చెబుతున్నారు.
అయితే మీటర్ రీడర్ల బదులు స్మార్ట్ మీటర్లలో ఉండే చిప్‌ల ఆధారంగా ఆ బిల్లులు నేరుగా ప్రధానకార్యాలయానికి చేరతాయన్నారు. స్మార్ట్ మీటర్లతో ప్రతీ నెలా చివరి రోజు రాత్రి 12 గంటలకు విద్యుత్ బిల్లు జారీకావడంతోపాటు వినియోగదారుల వాట్సాప్, మెయిల్‌కు వెళ్లిపోతాయన్నారు. నవంబరు చివరివారం నాటికి గ్రేటర్‌లో స్మార్ట్ మీటర్లు ప్రవేశపెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో ప్రతీ 30 నిమిషాలకు యూనిట్ల లెక్కలు తెలుసుకోవడంతో పాటు, ఏ రోజులో ఎన్ని విద్యుత్ యూనిట్లు వాడారనే స్పష్టమైన సమాచారం వినియోగదారులు తెలుసుకోవచ్చని దక్షిణ డిస్కం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
స్మార్ట్ మీటర్లతో వినియోగదారుడు రోజువారీగా గృహాలు, ఆఫీసుల్లో ఎన్ని యూనిట్లు విద్యుత్ వినియోగిస్తున్నారు, ఏ సమయంలో ఎక్కవ వాడుతున్నారనే విషయాలు తెలుసుకునేందుకు అవకాశాలుంటాయన్నారు. పెరుగుతున్న కొత్త విద్యుత్ కనెక్షన్లు, లోడ్‌కు అనుగుణంగా విద్యుత్‌వ్యవస్థను స్మార్ట్ దిశగా నడిపించేందుకు ఇవి ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సీపీఐతో చర్చించాకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతుపై నిర్ణయం: తమ్మినేని
‘మహాలక్ష్మి’కి మస్త్ డిమాండ్!
Read Latest AP News And Telangana News And International News And Telugu News