Share News

నేటి నుంచి ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమ్మె

ABN , Publish Date - Oct 06 , 2026 | 07:12 AM

ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని నేటి నుంచి సమ్మె చేపడుతున్నట్టు జేఏసీ కన్వీనర్‌ యం.అజయ్‌కుమార్‌ తెలిపారు

నేటి నుంచి ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమ్మె

  • ఉద్యోగాలు రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌

అమరావతి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని నేటి నుంచి సమ్మె చేపడుతున్నట్టు జేఏసీ కన్వీనర్‌ యం.అజయ్‌కుమార్‌ తెలిపారు. సోమవారం ఉదయం సచివాలయంలోని ఐదవ బ్లాక్‌లో ఆరోగ్య శాఖ కార్యదర్శిని కలిసిన జేఏసీ సభ్యులు, వారి సమస్యలను ఆయనకు విన్నవించారు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్‌ ఉద్యోగులు రెగ్యులరైజేషన్‌ కోసం, 100 శాతం జీతాల కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్నారన్నారు. ఇప్పటివరకూ తమకు న్యాయం జరగలేదని.. ఆరోగ్య శాఖ కార్యదర్శి కలిస్తే తాము ఏమీ చేయలేమని, తమ చేతుల్లో ఏమీ లేదని తేల్చిచెప్పినట్లు వివరించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో నేటి నుంచి సమ్మెలో పాల్గొంటామని చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి:

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్

ఏపీలో నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

Updated Date - Oct 06 , 2026 | 07:12 AM