Share News

భారత్ మాకు క్షమాపణ చెప్పాల్సిందే.. డబ్ల్యూసీఎల్ నుంచి తప్పుకున్న పాకిస్థాన్

ABN , Publish Date - Oct 06 , 2026 | 06:47 AM

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టు తప్పుకుంది. గత సీజన్‌లో తమతో మ్యాచ్ ఆడేందుకు నిరాకరించిన భారత జట్టు.. తమకు లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసినట్లు సమాచారం.

భారత్ మాకు క్షమాపణ చెప్పాల్సిందే.. డబ్ల్యూసీఎల్ నుంచి తప్పుకున్న పాకిస్థాన్
WCL 2026

ఇంటర్నెట్ డెస్క్: భారత జట్టుపై పాకిస్థాన్ మరోసారి బుద్ధి చూపించుకుంది. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టోర్నీ నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టు తప్పుకుంది. గత సీజన్‌లో తమతో మ్యాచ్ ఆడేందుకు నిరాకరించిన భారత జట్టు.. తమకు లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే ఈ డిమాండ్‌ను డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు తిరస్కరించడంతో పాకిస్థాన్ ఛాంపియన్స్ టోర్నీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.


గతేడాది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో WCLలో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడేందుకు భారత ఛాంపియన్స్ జట్టు నిరాకరించింది. దీంతో ఇరు జట్ల మధ్య జరగాల్సిన గ్రూప్ దశ మ్యాచ్ రద్దయింది. అనంతరం సెమీ ఫైనల్లోనూ పాకిస్థాన్‌తో ఆడేందుకు భారత జట్టు ససేమిరా అనడంతో.. పాకిస్థాన్‌కు వాకోవర్ లభించి ఫైనల్‌కు చేరింది.


ఈసారి WCLలో పాల్గొనేందుకు ఆటగాళ్లకు NOCలు ఇచ్చేందుకు పీసీబీ అంగీకరించింది. అయితే గత సీజన్‌లో భారత జట్టు తీసుకున్న నిర్ణయంపై లిఖితపూర్వక క్షమాపణ చెప్పాలని షరతు విధించింది. భారత జట్టు క్షమాపణ చెప్పేలా చూడాలని WCL నిర్వాహకులను పీసీబీ కోరినప్పటికీ.. వారు అందుకు అంగీకరించలేదు. అంతేకాదు.. ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు పాల్గొనకపోయినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని నిర్వాహకుల నుంచి హామీ ఇవ్వాలని కూడా పీసీబీ కోరినట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పాకిస్థాన్ ఛాంపియన్స్ టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. కాగా.. పాకిస్థాన్ జట్టు అనుకోని పరిస్థితుల కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నట్లు WCL నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.


ఇవి కూడా చదవండి:

నికోలస్ పూరన్ విధ్వంసం.. టొరంటో సిక్సర్స్‌కు కెనడా సూపర్ 60 టైటిల్

వైభవ్ సూర్యవంశీపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన అభిషేక్ శర్మ..

Updated Date - Oct 06 , 2026 | 06:47 AM