సంచలనం సృష్టించేనా?
ABN , Publish Date - Oct 06 , 2026 | 05:57 AM
ఫుట్‌బాల్ పవర్‌హౌస్ బ్రెజిల్‌ను ఎదుర్కొన్న అనుభవంతో భారత్ మరో సవాల్‌కు సిద్ధమైంది. ఫిఫా అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్‌ల్లో భాగంగా రెండుసార్లు ప్రపంచకప్ విజేత ఉరుగ్వేతో...
రాత్రి: 7.30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో
నేడు ఉరుగ్వేతో భారత్ ఫ్రెండ్లీ మ్యాచ్
కోల్‌కతా: ఫుట్‌బాల్ పవర్‌హౌస్ బ్రెజిల్‌ను ఎదుర్కొన్న అనుభవంతో భారత్ మరో సవాల్‌కు సిద్ధమైంది. ఫిఫా అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్‌ల్లో భాగంగా రెండుసార్లు ప్రపంచకప్ విజేత ఉరుగ్వేతో భారత్ మంగళవారం తలపడనుంది. బెంగళూరులో పనామాతో మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకొన్నా.. సాంబా జట్టు చేతిలో భారత్ 0-4తో చిత్తయింది. అయితే, ప్రపంచ 20వ ర్యాంకర్ అయిన ఉరుగ్వేపై 138వ స్థానంలో ఉన్న భారత్‌కు అది అనుకున్నంత సులువైతే కాదు. భారత్‌కు ర్యాన్ విలియమ్స్ కీలక స్ట్రయికర్ కాగా.. అనిరుధ్ థాపా మిడ్‌ఫీల్డ్‌లో రాణిస్తున్నాడు. కాగా, ఈ ఏడాది జరిగిన వరల్డ్‌క్‌పలో గ్రూప్ స్టేజ్‌లోనే నిష్క్రమించిన ఉరుగ్వే జట్టు ప్రస్తుతం సంధి దశలో ఉన్నా.. భారత్‌తో పోల్చుకొంటే ఎంతో బలంగా కనిపిస్తోంది.
రూ. 1999 టిక్కెట్..రూ. 199కే
బ్రెజిల్‌తో జరిగిన మ్యాచ్‌లో వేలాది సీట్లు ఖాళీగా దర్శనమివ్వడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే ఈ మ్యాచ్ టిక్కెట్ల విషయంలో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య కీలక నిర్ణయం తీసుకొంది. సాల్ట్ లేక్ స్టేడియంలో ఎంపిక చేసిన రెండు బ్లాక్‌ల్లోని టిక్కెట్ల రేట్లను రూ. 1999 నుంచి రూ. 199కి..అంటే 90శాతం మేర తగ్గించింది. వాస్తవంగా ఈ స్టేడియం సామర్థ్యం 85 వేలు కాగా.. బ్రెజిల్ మ్యాచ్‌కు 51వేల సీట్లే నిండాయి. స్టార్లతోకూడి, ఎంతో క్రేజ్ ఉన్న బ్రెజిల్ జట్టు ఆడుతున్న మ్యాచ్‌కు స్టాండ్‌లు పూర్తిగా నిండకపోవడానికి టిక్కెట్ ధరలు కూడా ఓ కారణమనే టాక్ వినిపించింది.
ఇవి కూడా చదవండి..
బాల్కనీ నుంచి కిందపడిన బాలుడు.. క్షణాల్లో స్పందించి కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్..
మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..