ఐసీసీ గ్లోబల్ ఫ్రాంచైజీ టీ20కి బ్రేక్.. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వ్యతిరేకత
ABN , Publish Date - Oct 05 , 2026 | 09:01 PM
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కొత్త కొత్త టోర్నీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ముఖ్యంగా ఛాంపియన్స్ లీగ్ తరహా లో గ్లోబల్ ఫ్రాంచైజీ టీ20 టోర్నీని నిర్వహించాలని భావించింది. అయితే ఐసీసీ ఆలోచనకు భారీ ఎదురు దెబ్బ తగిలింది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కొత్త కొత్త టోర్నీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ముఖ్యంగా ఛాంపియన్స్ లీగ్ తరహా లో గ్లోబల్ ఫ్రాంచైజీ టీ20 టోర్నీని నిర్వహించాలని భావించింది. అయితే ఐసీసీ ఆలోచనకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. క్రికెట్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులు తీవ్రంగా వ్యతిరేకించాయి. ద్వైపాక్షిక సిరీస్‌లు, ఐపీఎల్, బిగ్ బాష్, ది హండ్రెడ్ వంటి సొంత లీగ్ షెడ్యూల్స్ మధ్య ఈ గ్లోబల్ ఫ్రాంచైజీని నిర్వహించడం అసాధ్యమని ఈ మూడు క్రికెట్ బోర్డులు తెగేసి చెప్పాయి.
ఇప్పటికే కిక్కిరిసిన షెడ్యూల్‌తో ఆటగాళ్లకు తగిన విశ్రాంతి లేకుండా పోతుందని, అదనపు టోర్నీలకు క్యాలెండర్‌లో ఏమాత్రం చోటు ఇవ్వలేమని భారత్ క్రికెట్ నియంత్రణ మండలితో సహా ఈసీబీ, క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేశాయి. ఈ మూడు దేశాలు వ్యతిరేకించడంతో ఐసీసీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. 2031 వరకు ఎలాంటి గ్లోబల్ ఫ్రాంచైజీ టోర్నీలను నిర్వహించోమని స్పష్టం చేసినట్లు ఓ బ్రిటీష్ మీడియా సంస్థ వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్ ద్వారా ఆయా క్రికెట్ బోర్డులు వందల కోట్ల డాలర్ల ఆదాయం సంపాదిస్తున్నప్పటికీ ఐసీసీకి ఒక్క రూపాయి దక్కడం లేదు.ఈ క్రమంలోనే ఫుట్‌బాల్ క్లబ్ వరల్డ్ కప్ తరహాలో ఆదాయ వనరును సృష్టించుకోవాలని ఐసీసీ భావించింది. నాలుగు దేశాల టీ20 టోర్నీలు నిర్వహించాలని కూడా నిర్ణయించింది. కానీ భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులు ఈ నిర్ణయాలను వ్యతిరేకించాయి. దీంతో ఐసీసీ తమ ప్రతిపాదనలను పూర్తిగా వెనక్కి తీసుకుంది.
ఇవి కూడా చదవండి:
నికోలస్ పూరన్ విధ్వంసం.. టొరంటో సిక్సర్స్‌కు కెనడా సూపర్ 60 టైటిల్
వైభవ్ సూర్యవంశీపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన అభిషేక్ శర్మ..
స్లో ఓవర్ రేట్.. టీమిండియా, వెస్టిండీస్‌కు ఫైన్