Share News

స్లో ఓవర్ రేట్.. టీమిండియా, వెస్టిండీస్‌‌కు ఫైన్

ABN , Publish Date - Oct 05 , 2026 | 04:22 PM

స్లో ఓవర్ రేట్ కారణంగా ఇండియా, వెస్టిండీస్‌ జట్లకు ఐసీసీ ఫైన్ విధించింది. భారత్ మ్యాచ్ ఫీజులో 20 శాతం, విండీస్ మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించినట్టు ప్రకటించింది.

స్లో ఓవర్ రేట్.. టీమిండియా, వెస్టిండీస్‌‌కు ఫైన్
Slow Over Rate Fine

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా, వెస్టిండీస్ మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్ తరువాత ఐఐసీ ఇరు జట్లకూ షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇండియాకు, వెస్టిండీస్‌కు ఫైన్ విధించింది. భారత్ మ్యాచ్ ఫీజులో 20 శాతం, విండీస్ మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించినట్టు ఐసీసీ ప్రకటించింది. ఆ మ్యాచ్‌లో నిర్ణీత సమయం పూర్తయ్యే సరికి టీమిండియా 4 ఓవర్లు, ప్రత్యర్థి జట్టు 2 ఓవర్లు వెనుకబడ్డాయి. అందుకే ఐసీసీ ఈ జరిమానా విధించింది.


కాగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గత శనివారం జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ భారత్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. 352 పరుగుల భారీ లక్ష్యాన్ని విండీస్ బ్యాటర్లు 48.2 ఓవర్లలోనే ఛేదించారు అయితే అంతకు ముందు జరిగిన రెండు వన్డేలు నెగ్గిన టీమిండియా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.


ఈ వార్తలూ చదవండి

వెస్టిండీస్‌తో తొలి టీ20: అర్ష్‌దీప్ రీఎంట్రీ.. సంజు ఔట్!

టీమిండియా ఇప్పుడు షమీ వైపు చూడటంలో అర్థం లేదు: దినేశ్ కార్తీక్

Updated Date - Oct 05 , 2026 | 04:23 PM