జైరాం రమేశ్ ఆ పోస్టును వెంటనే తొలగించాలి: ఎంపీ కలిశెట్టి
ABN , Publish Date - Oct 05 , 2026 | 02:20 PM
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ చేసిన పోస్టును టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తప్పుబట్టారు. ఫేక్ పోస్టును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
విజయనగరం జిల్లా, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ చేసిన పోస్టును తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు (TDP MP Kalisetti AppalaNaidu) తప్పుబట్టారు. ఫేక్ పోస్టును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ది నకిలీ వార్తల రాజకీయమని.. అబద్ధాల ప్రచారంతోనే ఆ పార్టీ పతనమైందని విమర్శించారు. వాస్తవాలు తెలుసుకోకుండా జైరాం రమేశ్ పోస్టు పెట్టారని ధ్వజమెత్తారు. ఈరోజు (సోమవారం) విజయనగరం జిల్లాలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నకిలీ వార్తలను సృష్టించడం, వాటి ఆధారంగా సమాజంలో గందరగోళం రేపడమే కాంగ్రెస్ నైజంగా మారిందని ఆగ్రహించారు.
భవిష్యత్తులో కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం ఖాయం..
వాస్తవాలను కనీసం పరిశీలించకుండా కాంగ్రెస్ సీనియర్ నాయకులు సైతం నిరాధారమైన ప్రచారాలకు ఒడిగట్టడం దారుణమని ఎంపీ కలిశెట్టి మండిపడ్డారు. కాంగ్రెస్ అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్లే ప్రజలు ఆ పార్టీని పూర్తిగా తిరస్కరించి అట్టడుగుకు నెట్టారని, అబద్ధాలనే నమ్ముకుంటే భవిష్యత్తులో ఆ పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం ఖాయమని హెచ్చరించారు. నిర్మలా సీతారామన్ ప్రసంగానికి ఉద్యోగాలు కోరుతూ యువత అడ్డంకులు సృష్టించారంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఎంపీ స్పష్టం చేశారు. సభలో ఉత్సాహంగా ఉన్న జనంతో ఆర్థిక మంత్రి సాధారణ సంభాషణ చేస్తుంటే.. ఆ వీడియోను ఉద్దేశపూర్వకంగా కట్ చేసి, వక్రీకరించి ఒక కల్పిత కథనాన్ని అల్లారని ధ్వజమెత్తారు.
విష ప్రచారం చేయడం సిగ్గుచేటు..
లేని అంశాన్ని ఉన్నట్లుగా చూపిస్తూ సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం చేయడం సిగ్గుచేటని ఎంపీ కలిశెట్టి ఫైర్ అయ్యారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు వాస్తవాలు ఏంటో తెలుసుకోకుండా, కనీస పరిశీలన చేయకుండా పోస్టు చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా పెట్టిన ఆ తప్పుడు పోస్టును జైరాం రమేశ్ తక్షణమే తొలగించాలని కలిశెట్టి అప్పలనాయుడు డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గొడ్డలి పార్టీ పాలనలో 6 లక్షల పేదల ఇళ్లు రద్దు చేశారు: సీఎం చంద్రబాబు
ఏపీలో గృహ నిర్మాణ రంగంలో నూతన శకం ప్రారంభం: పవన్ కల్యాణ్
ప్రజల స్పందనను వక్రీకరించొద్దు.. జై రాం రమేశ్‌కు చంద్రబాబు, లోకేశ్ కౌంటర్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News