Share News

వెస్టిండీస్‌తో తొలి టీ20: అర్ష్‌దీప్ రీఎంట్రీ.. సంజు ఔట్!

ABN , Publish Date - Oct 05 , 2026 | 01:35 PM

వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తొలి టీ20 మంగళవారం లఖ్‌నవూలోని ఏకనా క్రికెట్‌ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు భారత తుది జట్టులో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

వెస్టిండీస్‌తో తొలి టీ20: అర్ష్‌దీప్ రీఎంట్రీ.. సంజు ఔట్!
India vs West Indies

ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తొలి టీ20 మంగళవారం లఖ్‌నవూలోని ఏకనా క్రికెట్‌ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు భారత తుది జట్టులో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. భారత స్టార్‌ పేసర్‌ బుమ్రాకు వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు విశ్రాంతినిచ్చారు. దీంతో అతడి స్థానంలో ఎడమచేతి వాటం పేసర్‌ అర్ష్‌దీప్ సింగ్‌ తుది జట్టులోకి తిరిగి రానున్నాడు. మరోవైపు మయాంక్ యాదవ్ లేదా ప్రిన్స్ యాదవ్‌లలో ఒకరికి కూడా అవకాశం దక్కే ఛాన్స్‌ ఉంది.


అర్ష్‌దీప్‌ ఇటీవల సెప్టెంబర్‌ 22న జపాన్‌తో జరిగిన ఏకైక టీ20లో భారత జట్టులో ఉన్నాడు. అయితే వర్షం కారణంగా మ్యాచ్‌ ఐదు ఓవర్లకు కుదించడంతో అతడికి బౌలింగ్‌ చేసే అవకాశం రాలేదు. అనంతరం ఆసియా క్రీడలు-2026లో శ్రీలంక, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లకు అతడిని తుది జట్టులోకి తీసుకోలేదు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించిన కుల్దీప్ యాదవ్‌ తొలి టీ20లోనూ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. మూడు వన్డేల్లో ఏకంగా ఏడు వికెట్లు తీసిన కుల్దీప్‌.. రవి బిష్ణోయ్ స్థానంలో జట్టులోకి వచ్చే అవకాశముంది.


సంజు స్థానంలో వైభవ్‌?

స్టార్ వికెట్‌ కీపర్‌, బ్యాటర్ సంజు శాంసన్‌పై వేటు పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. జపాన్‌లో జరిగిన మూడు టీ20ల్లో సంజు వరుసగా 9, 7, 2 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడి స్థానంలో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలని టీమ్‌ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. సంజును తప్పిస్తే.. అతడి స్థానంలో మరో బౌలర్‌ లేదా ఆల్‌రౌండర్‌ను తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో నితీశ్ కుమార్ రెడ్డికి కూడా తుది జట్టులో చోటు దక్కవచ్చని తెలుస్తోంది.

వెస్టిండీస్‌తో తొలి టీ20: భారత్‌ తుది జట్టు అంచనా

వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్.


ఇవి కూడా చదవండి:

బ్యాట్‌కు తగలకుండానే బౌండరీ దాటిన బంతి.. ఈ వైరల్ వీడియో చూశారా?

ఇది చాలా ప్రత్యేకం.. ఆసియాడ్ స్వర్ణ పతకంపై వీవీఎస్ లక్ష్మణ్ రియాక్షన్

Updated Date - Oct 05 , 2026 | 01:35 PM