ఇది చాలా ప్రత్యేకం.. ఆసియాడ్ స్వర్ణ పతకంపై వీవీఎస్ లక్ష్మణ్ రియాక్షన్
ABN , Publish Date - Oct 05 , 2026 | 10:23 AM
ఆసియా క్రీడలు-2026లో భారత పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోవడంపై టీమిండియా హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడలు-2026లో భారత పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోవడంపై టీమిండియా హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశాడు. ఫైనల్ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 19 పరుగుల తేడాతో ఓడించి వరుసగా రెండోసారి ఆసియాడ్ గోల్డ్ మెడల్ సాధించడం ఎంతో ప్రత్యేకమైన విషయమని పేర్కొన్నాడు.
‘స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోవడం కచ్చితంగా చాలా ప్రత్యేకం. రెండేళ్ల క్రితం చైనాలో స్వర్ణం గెలిచాం. ఇప్పుడు మరోసారి విజయం సాధించాం. కుర్రాళ్లు అద్భుతంగా రాణించారు. వాళ్ల ప్రదర్శన పట్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇది వారికి ప్రత్యేకమైన గౌరవం. జట్టులో చాలామంది ప్రపంచకప్ గెలిచారు. కానీ వారిలో చాలా మందికి స్వర్ణ పతకం గెలవడం ఇదే తొలిసారి. ఈ విజయం ప్లేయర్లందరికీ ఎంతో గర్వకారణం. పాకిస్థాన్ గట్టి పోటీనే ఇచ్చింది. ఒత్తిడిలోనూ మా కుర్రాళ్లు ఒకటిగా నిలబడి అద్భుతంగా ఆడారు. జపాన్‌కు వచ్చినప్పటి నుంచి పరిస్థితులు సవాల్‌గా ఉన్నాయి. టోక్యోలో వర్షం మమ్మల్ని వెంటాడింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి ఎదురైంది. అయినప్పటికీ జట్టు మొత్తం బాగా ఆడింది. ఈ ఫలితం పట్ల చాలా సంతోషంగా ఉన్నా’ అని లక్ష్మణ్ వివరించాడు.
ఇవి కూడా చదవండి:
వైభవ్‌ను చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది: శ్రేయస్ అయ్యర్
ఆసియాడ్: పతకాలు సాధించిన భారత అథ్లెట్లకు మోదీ అభినందనలు