Share News

ఆ సామర్థ్యం అతడికే ఉంది.. వన్డేల్లో కోహ్లీ వారసుడు ఎవరంటే?

ABN , Publish Date - Oct 05 , 2026 | 09:26 AM

2027 వన్డే ప్రపంచకప్‌ తర్వాత కోహ్లీ అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు పలికే అవకాశం ఉంది. దీంతో అతడి స్థానాన్ని భర్తీ చేయగల సత్తా యువ బ్యాటర్ తిలక్ వర్మకు ఉందని భారత మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్ అభిప్రాయపడ్డాడు.

ఆ సామర్థ్యం అతడికే ఉంది.. వన్డేల్లో కోహ్లీ వారసుడు ఎవరంటే?
Virat Kohli

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తర్వాత వన్డేల్లో నంబర్-3 స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే చర్చ మొదలైంది. 2027 వన్డే ప్రపంచకప్‌ తర్వాత కోహ్లీ అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు పలికే అవకాశం ఉండటంతో.. అతడి స్థానాన్ని భర్తీ చేయగల సత్తా యువ బ్యాటర్ తిలక్ వర్మకు ఉందని మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్ అభిప్రాయపడ్డాడు.


‘తిలక్ వర్మ ఏ స్థానంలోనైనా రాణించగలడు. గతంలో నంబర్-3లో సెంచరీ చేశాడు. ఇప్పుడు నంబర్-5, 6 స్థానాల్లోనూ అద్భుతంగా ఆడుతున్నాడు. ఇది చాలా గొప్ప లక్షణం. విరాట్, రోహిత్‌లు తప్పుకున్న తర్వాత టాప్‌ ఆర్డర్‌లో మార్పులు వస్తాయి. రోహిత్ స్థానాన్ని భర్తీ చేసేందుకు యశస్వి జైస్వాల్ ఉన్నాడు. అయితే విరాట్ స్థానంలో ఎడమచేతి వాటం బ్యాటర్ వచ్చే అవకాశం ఉందని నేను భావిస్తున్నా. తిలక్‌కు ఆ సామర్థ్యం ఉంది. దులీప్ ట్రోఫీలో అతడు పరుగులు చేసిన విధానం చూశాం. ఫస్ట్‌క్లాస్‌లో అతడి సగటు దాదాపు 55. మూడు ఫార్మాట్లలోనూ అతడు సులభంగా సరిపోతాడు’ అని జాఫర్ వెల్లడించాడు. అయితే తిలక్ వర్మ ఇప్పటివరకు భారత్ తరఫున నాలుగు వన్డేలు మాత్రమే ఆడాడు. ఇందులో 68 పరుగులు చేశాడు. నంబర్-3లో రెండుసార్లు, నంబర్-4, 5 స్థానాల్లో ఒక్కోసారి బ్యాటింగ్ చేశాడు. 2025 డిసెంబరులో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే అతడికి చివరిది.


ఇవి కూడా చదవండి:

వైభవ్‌ను చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది: శ్రేయస్ అయ్యర్

ఆసియాడ్: పతకాలు సాధించిన భారత అథ్లెట్లకు మోదీ అభినందనలు

Updated Date - Oct 05 , 2026 | 09:28 AM