బ్యాట్‌కు తగలకుండానే బౌండరీ దాటిన బంతి.. ఈ వైరల్ వీడియో చూశారా?
ABN , Publish Date - Oct 05 , 2026 | 11:05 AM
క్రికెట్‌లో ఒక్కోసారి జరిగే విచిత్ర ఘటనలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా కెనడా సూపర్60 లీగ్‌లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌లో ఒక్కోసారి జరిగే విచిత్ర ఘటనలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా కెనడా సూపర్60 లీగ్‌లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. టొరంటో సిక్సర్స్, మిసిసాగా మాస్టర్స్ మధ్య జరిగిన సెమీఫైనల్లో ఫాస్ట్ బౌలర్ అలీ ఖాన్ వేసిన బంతి.. బ్యాటర్‌ను తాకకుండానే బౌండరీ దాటింది. దీంతో తొలుత అది సిక్సర్‌గా భావించినా.. చివరికి అంపైర్లు బౌండరీ ప్లస్ వైడ్‌గా ప్రకటించారు.
మిసిసాగా మాస్టర్స్ బ్యాటర్ కీరన్ పొలార్డ్‌ను అలీ ఖాన్ ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో అలీ ఖాన్ వేసిన బౌన్సర్ అనుకున్నదానికంటే కాస్త ఎక్కువగా షార్ట్ లెంగ్త్‌లో పడింది. అది పొలార్డ్ బ్యాట్‌కు తగలకుండా నేరుగా వికెట్ కీపర్ తలపై నుంచి దూసుకెళ్లి బౌండరీ లైన్ అవతల పడింది. బంతి బౌండరీ దాటడంతో స్టేడియంలోని అభిమానులు సిక్సర్ అనుకుని సంబరాలు చేసుకున్నారు. అయితే బంతికి పొలార్డ్ బ్యాట్ ఎలాంటి టచ్ ఇవ్వలేదని గుర్తించిన అంపైర్లు.. దానిని సిక్సర్‌గా కాకుండా వైడ్‌గా ప్రకటించారు. బంతి బౌండరీకి వెళ్లినందుకు అదనంగా నాలుగు పరుగులు కలిపారు. దీంతో ఆ ఒక్క బంతికే టొరంటో సిక్సర్స్‌కు మొత్తం ఐదు పరుగులు లభించాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. క్రికెట్ చరిత్రలోనే ఇది తొలి బౌన్సర్ అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. బౌండరీలు మరీ ఇంత చిన్నగా ఉంటాయా అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ఇవి కూడా చదవండి:
వైభవ్‌ను చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది: శ్రేయస్ అయ్యర్
ఆసియాడ్: పతకాలు సాధించిన భారత అథ్లెట్లకు మోదీ అభినందనలు