Share News

విజయవాడ దసరా వేడుకలకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు ఆహ్వానం

ABN , Publish Date - Oct 05 , 2026 | 03:58 PM

విజయవాడలో ఘనంగా నిర్వహించనున్న దసరా నవరాత్రి వేడుకలు, విజయవాడ ఉత్సవ్-2.0కు రావాల్సిందిగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌‌‌ను ఆహ్వానించారు.

విజయవాడ దసరా వేడుకలకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు ఆహ్వానం
Vijayawada Dasara Celebrations

ఢిల్లీ, అక్టోబర్ 5: విజయవాడలో ఘనంగా నిర్వహించనున్న దసరా నవరాత్రి వేడుకలు, విజయవాడ ఉత్సవ్-2.0కు రావాల్సిందిగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌‌‌ను ఆహ్వానించారు. ఈ మేరకు కేంద్ర మంత్రిని ఎన్టీఆర్ జిల్లా ఇన్‌ఛార్జ్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని, ఎంపీ హరీశ్ బాలయోగి కలిసి ఉత్సవాలకు ఆహ్వానించారు.


ఈ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారి దివ్య ఆశీస్సులు పొందడంతో పాటు నగర సాంస్కృతిక వైభవాన్ని వీక్షించాలని కేంద్ర మంత్రిని వారు ఆహ్వానించారు. విజయవాడ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పేలా విజయవాడ ఉత్సవ్–2.0‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో దసరా నవరాత్రి వేడుకలతో పాటు విజయవాడ ఉత్సవ్‌లో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌‌ భాగస్వామ్యం కావాలంటూ ఆత్మీయంగా కోరారు.


ఇవి కూడా చదవండి...

వివేకా హత్య కేసులో జగన్ మౌనం నేరాంగీకారమే: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

రాంబిల్లి సెజ్‌లో కొత్త విద్యుత్ ఉపకేంద్రం.. పరిశ్రమలకు మెరుగైన విద్యుత్ సరఫరా

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 05 , 2026 | 03:58 PM