Share News

రాంబిల్లి సెజ్‌లో కొత్త విద్యుత్ ఉపకేంద్రం.. పరిశ్రమలకు మెరుగైన విద్యుత్ సరఫరా

ABN , Publish Date - Oct 05 , 2026 | 03:32 PM

అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి సెజ్ పరిధిలో నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఈరోజు ప్రారంభించారు.

రాంబిల్లి సెజ్‌లో కొత్త విద్యుత్ ఉపకేంద్రం.. పరిశ్రమలకు మెరుగైన విద్యుత్ సరఫరా
Minister Gottipati Ravikumar

అనకాపల్లి జిల్లా, అక్టోబర్ 5: జిల్లాలోని రాంబిల్లి సెజ్ పరిధిలో నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఈరోజు(సోమవారం) ప్రారంభించారు. అచ్యుతాపురం సెజ్ పరిధిలో కంపెనీలకు విద్యుత్తు అందించేందుకు ఈ 220/132//33 కె.వి విద్యుత్ ఉప కేంద్రాన్ని (గ్యాస్ ఇన్సులేటెడ్) నిర్మించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన పరిశ్రమలకు అవకాశం కల్పిస్తోందన్నారు. గత ప్రభుత్వం పరిశ్రమలకు విద్యుత్ సబ్‌స్టేషన్లను అశ్రద్ధ చేసిందని విమర్శించారు.


గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన విద్యుత్ సబ్‌స్టేషన్‌లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు పునరుద్ధరణ చేయడం జరిగిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఆర్ డీసీ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, కలెక్టర్ విజయ్ కృష్ణన్ హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి...

మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

వివేకా హత్య కేసులో జగన్ మౌనం నేరాంగీకారమే: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 05 , 2026 | 03:43 PM